ఆ అందగత్తెలకి అంతేసి డిమాండ్

Update: 2016-05-01 17:30 GMT
హైద్రాబాద్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితా చూస్తే.. ఔరా అనిపించక మానదు. ఈ లిస్ట్ లో మొదటి నలుగురు భామలు సీనియర్ సుందరాంగులే. కుర్ర హీరోయిన్లకు టాప్ ఫైవ్ లో స్థానం కూడా దక్కలేదు. ఫస్ట్ ప్లేస్ లో అనుష్క ఉండగా.. తర్వాత శ్రియ, థర్డ్ ప్లేస్ లో తమన్నా, నాలుగో స్థానంలో కాజల్ ఉండగా.. జనాల్లో మోస్ట్ పాపులర్ అని భావించే సమంతకు కేవలం ఐదో స్థానం దక్కింది. దేశమంతా మెచ్చిన శృతి హాసన్ ఆరో స్థానానికి పరిమితమైంది. ఈమె ర్యాంక్ 4 నుంచి ఆరుకు పడిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

యంగ్ హీరోయిన్లలో రకుల్  ప్రీత్ సింగ్ 8 నుంచి ఏడో స్థానానికి ఎక్కగా.. హేభా పటేల్(8), దిశా పటానీ(9), రాశి ఖన్నా(10)లు.. ఈ ర్యాంకింగ్స్ లో అరంగేట్రంలోనే టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు. తాప్సీ 24 నుంచి 11వ స్థానానికి చేరుకోవడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. రెజీనా కూడా 23నుంచి 14వ ర్యాంకుకు వచ్చేసింది. నిత్యా మీనన్ 19 నుంచి 15కి చేరిందంతే. జ్వాలా గుత్తా - పీవీ సింధు లాంటి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కు కూడా చోటు దక్కింది.

అన్నింటికంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే.. గతేడాది నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న సానియా మీర్జా.. ఈ ఏడాది 17వ స్థానానికి పడిపోయింది. మొత్తానికి జనాలు ఫ్రెష్ నెస్ కంటే.. ఎక్స్ పీరియన్స్ ప్లస్ ట్యాలెంట్ కే చోటిచ్చి, ఓటు వేశారని అనిపించక మానదు.
Tags:    

Similar News