కరోనా వైరస్ .. చైనాలోని వుహాన్ సిటీలో మొదలైన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తుంది. ఈ కరోనా దెబ్బకి ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదకర వైరస్ ప్రభావం భారత దేశం పైన కూడా బాగానే పడింది. కరోనాని అరికట్టడానికి ..మన దేశంలో కూడా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీనితో కరోనాను ఎదురించడానికి ప్రముఖులు , సినీ స్టార్స్ క్రికెట్, బాడ్మింటన్, ఫుట్ బాల్, టెన్నిస్, అథ్లెట్లు ఒక్కొక్కరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేస్తున్నారు.
ఇకపోతే, తాజాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జరుగుతున్న పోరాటంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా తనవంతు సాయం చేసింది. కరోనా కారణంగా పూట గడువని పరిస్థితుల్లో కొట్టు మిట్టాడుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు సానియా మీర్జా రూ. 1.25 కోట్లను విరాళాలుగా సేకరించింది. వీటి ద్వారా అన్నార్థులకు సహాయం చేయబోతుంది.
ఈ విషయాన్ని సానియా సోమవారం తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కరోనాతో తినడానికి తిండి లేకుండా రోడ్డున పడ్డ వారి కోసం ఏమన్న చేయాలన్న తపనతో కొందరం కలిసి ఒక గ్రూపుగా ఏర్పడ్డాం అని , ఈ మొత్తాన్ని కేవలం వారం వ్యవధిలోనే సేకరించాం అని , ఈ మొత్తంతో వేల కుటుంబాలకు అన్నదానం చేయనున్నాం అని తెలిపింది. దీన్ని మేమందరం కలిసి ఇంకా కొనసాగిస్తాం అని తెలిపింది. యూత్‌ఫీడ్ ఇండియా, సఫా ఇండియా ఇందులో భాగస్వామ్యమయ్యాయని తెలిపారు. అలాగే ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ ఇళ్లలోనే గడపాలని సూచించారు. అప్పుడే ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మనకు అవకాశం చిక్కుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మహిళా క్రీడాకారులు మిథాలీ రాజ్ రూ. 10 లక్షలు, స్పిన్నర్ పూనం యాదవ్ రూ. 2 లక్షలు, ఎంపీ మేరీకోమ్ తన నెల జీతం, దీప్తి శర్మ రూ. 1.5 లక్ష, షూటర్ మనుబాకర్ లక్ష రూపాయలు, స్ప్రింటర్ హిమదాస్ తన నెల జీతం విరాళం గా ప్రకటించారు.