పెళ్లికి సంజ‌న రెడీ.. మ‌త మార్పిడి.. డ్ర‌గ్స్ పైనా వివ‌ర‌ణ‌!

Update: 2021-02-14 09:00 GMT
అందాల క‌థానాయిక సంజ‌న చుట్టూ ముసురుకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ఇంత‌కుముందే డ్ర‌గ్స్ కేసులో అరెస్ట‌య్యి తిరిగి బెయిల్ పై బ‌య‌టికి వ‌చ్చారు. అంత‌కుముందు హిందువు అయిన సంజనా గల్రానీకి బలవంతంగా ఇస్లాం మతంలోకి మారార‌ని.. ఇస్లాం దర్మం ప్రకారం ఆమెకు మహిరా అని నామకరణం చేశార‌ని.. వివాదం చెల‌రేగింది. దీనిపై కేసులు న‌మోద‌య్యాయి. ఇక సంజ‌న సీక్రెట్ పెళ్లి అంశం కూడా హాట్ టాపిక్ అయ్యింది. తాను డాక్ట‌ర్ అజీన్ ని ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకుంద‌ని ఆధారాలు చూపుతూ కొన్ని ఫోటోల్ని కూడా లీక్ చేశారు వెబ్ లో.

అయితే సంజనా గర్రానీ మొదటిసారి బెంగళూరు టైమ్స్ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ లో వాటిపై వివ‌ర‌ణ ఇచ్చారు. తాను ఇష్ట ప్రకారమే ఇస్లాం మతం స్వీకరించానని మతం మారాలని తనను ఎవ్వరూ బలవంతం చెయ్యలేదని నటి సంజనా వివరణ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో డాక్టర్ అజీజ్ తో తన నిశ్చితార్థం జరిగిందని ఆ విషయం తన స్నేహితులకు తెలుసని సంజనా వివరించారు. డాక్ట‌ర్ ని ప్రేమించాన‌ని నిశ్చితార్థం కూడా అయ్యింద‌ని తెలిపిన సంజ‌న అత‌డినే పెళ్లాడ‌తాన‌ని తెలిపారు.

తాను అన్ని మ‌తాల్ని  గౌర‌విస్తాన‌ని న‌మాజ్ చేస్తాన‌ని నేర్చుకుంటాన‌ని కూడా సంజ‌న అన్నారు. జైలు జీవితంలో క‌ష్టాల్ని ఎదుర్కొన్నాన‌ని సంజనా అన్నారు. న్యాయస్థానం మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, నిర్దోషిగా బయట పడుతాననే నమ్మకం వ్య‌క్తం చేశారు. ఇక‌పై సినిమాలు వెబ్ సిరీస్ ల‌తో బిజీ అవుతాన‌ని కెరీర్ పై దృష్టి సారిస్తాన‌ని కూడా సంజ‌న వెల్ల‌డించారు. చేతిలో ఉన్న క‌న్న‌డ‌-త‌మిళ చిత్రాల్ని పూర్తి చేసిన తరువాత హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తానని .. అలాగే మరో కొత్త సినిమా ఆఫర్ వచ్చిందని కూడా తెలిపారు.
Tags:    

Similar News