ఆర్పేసుకున్నాక ఆరాటం ఎందుకు తల్లి?

Update: 2017-02-28 11:03 GMT
సంజన గల్రాని. బుజ్జిగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ సుందరి. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించింది కాని.. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆమె కెరియర్ కు కావల్సినంత ఊపును ఇవ్వేలేకపోయాయి. అయితే ఇప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్లతో విరుచుకుపడుతోంది అమ్మడు. అవన్నీ చూస్తే ఎవరికైనా కూడా ఎందుకివన్నీ అనిపించక మానదు.

నిజానికి సంజన తన కెరియర్ దీపాన్ని తానే ఆర్పేసుకుందని చెప్పొచ్చు. అప్పట్లో ఆమెకు కొన్ని మంచి సినిమాలు వచ్చినప్పటికీ.. అనవసరమైన సినిమాలో టూ పీస్ బికినీలు వేసుకుని నటించేసి నానా రభస చేసేసింది. ఆ మితిమీరిన ఎక్స్ పోజింగ్ కారణంగా ఆమెను బి-లిస్ట్ లో పెట్టేశారు టాలీవుడ్ వర్గాలు. దానితో సంజనకు ఆఫర్లు కరువైపోయాయ్. కట్ చేస్తే ఎంతసేపూ రిబ్బన్ కటింగులు చేసుకుంటూ.. బెంగుళూరులో తను పెట్టుకున్న యోగా సెంటర్ ను నడుపుకుంటూ కాలం గడిపేస్తోంది.

ఇప్పుడిక ఒక కొత్త ఫోటో షూట్ తో దిగేసింది ఈ బంగారం. గతంలో మాదిరే హాటు హాటుగా ఫోజులిస్తూ.. బికినీ లుక్స్ నుండి బెల్లీ కిక్స్ వరకు అన్నీ ఇచ్చేసింది. కాని ఒక్కసారి కెరియర్ ఆర్పేసుకున్నాక మళ్ళీ టేకాఫ్‌ చేసుకోవడానికి ఆరాటపడినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదని చరిత్ర చెబుతోంది. సదా.. శ్రీయ అండ్ ఇలియానా అందుకు ఎగ్జాంపుల్స్. నువ్వేమన్నా చరిత్రను తిరగరాస్తావా తల్లి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News