సుక్కు బాట.. వర్మ స్ఫూర్తి.. మారుతి థీమ్

Update: 2018-05-29 04:24 GMT
టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా.. ఈ కౌంట్ తక్కువే అని చెప్పాలి. ఇప్పుడు సంజనా రెడ్డి అనే మహిళ.. రాజ్ తరుణ్ మూవీ రాజుగాడుతో టాలీవుడ్ దర్శకురాలిగా పరిచయం అవుతోంది. లెక్కల మాస్టారి ఉద్యోగం నుంచి దర్శకుడుగా మారిన సుకుమార్ తరహాలోనే.. సంజనా రెడ్డి కూడా అదే ప్రొఫెషన్ నుంచి రావడం విశేషం.

మొదట మ్యాథ్య్ టీచర్ గా.. ఆ తర్వాత సాఫ్ట్‌ వేర్ కంపెనీలో ఉద్యోగిగా.. ఆ తర్వాత జర్నలిస్ట్ గా విధులు నిర్వహించిన సంజన.. రాంగోపాల్ వర్మతో కలిసి రౌడీ చిత్రానికి వారం రోజులు పని చేసిందట. తనలో ఉన్న ఫిలిం మేకింగ్ స్కిల్స్ ను తెలుసుకున్న ఈమె.. మలేషియా.. సింగపూర్.. హాంగ్ కాంగ్.. బ్యాంగ్ కాక్ తో సహా పలు దేశాలను సందర్శించి అక్కడ ఫిలిం మేకింగ్ కు సంబంధించిన మెళకువలు నేర్చుకున్నట్లు చెబుతోంది. ఇండియాకి వచ్చిన తర్వాత సినిమా దర్శకత్వం వహించాలని ఇండస్ట్రీ జనాలతో మాట్లాడితే.. 10 ఏళ్లు పడుతుందని అన్నారట.

ఆ సమయంలో నాగార్జున సతీమణి అమలను కలవడం వలన  ఓ కమర్షియల్ రూపొందించే ధైర్యం కూడకట్టుకున్నానని ఆమె తెలిపింది. రాజ్ తరుణ్ తో కలిసి స్టోరీ డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. భలేభలే మగాడివోయ్ మూవీ సక్సెస్ సాధించడం చూసి.. ఈ క్లెప్టో మానియాక్ థీమ్ ను రూపొందించారట. చిలిపి దొంగతాలు అనే కాన్సెప్ట్ చుట్టూ కథ.. క్యారెక్టర్లను డెవలప్ చేసుకున్నట్లు చెప్పిన సంజనా రెడ్డి.. రిలీజ్ ఆలస్యం అయినా.. మూవీ సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు చెబుతోంది.
Tags:    

Similar News