ప్రముఖ హాస్యనటుడు అలీ హోస్ట్ గా చేస్తున్న ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ సంజన పలు సంచలన విషయాలు చెప్పి దుమారం రేపింది. 17ఏళ్లకే సినిమా ఇండస్ట్రీకి వచ్చానని.. మోడలింగ్ చేసే రోజుల్లో బైక్ మీద తిరుగుతూ అవకాశాల కోసం ప్రయత్నించానని తెలిపింది. ఆ సమయంలోనే కన్నడ నుంచి తొలి సినిమా అవకాశం వచ్చిందని.. రూ.2 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తామంటే ఒప్పుకున్నానని తెలిపింది. కానీ తొలి సినిమాకే నరకం చూశానని వాపోయింది. ఆ సినిమా డైరెక్టర్ శాడిస్ట్ - సైకో ప్రవర్తనతో ఇండస్ట్రీ అంటేనే భయం వేసిందని వాపోయింది.
తన మొదటి సినిమా స్క్రిప్ట్ చదవకుండా తాను సంతకం చేశా.. అందులో ముద్దుసీన్లు - రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసి సినిమా చేయనని చెబుతామని డైరెక్టర్ వద్దకు వెళ్లా.. కానీ కాంట్రాక్ట్ మీద సైన్ చేశావ్.. నీపై కేసు పెడతానని డైరెక్టర్ బెదిరించడంతో వెనక్కి తగ్గాను’’ అని సంజన తన తొలి సినిమా భయానక అనుభవాలను వివరించింది.
సినిమా విడుదలయ్యాక అమ్మానాన్నతో కలిసి సినిమా చూశానని.. నాన్న సినిమాలోని ముద్దు సీన్లు - రొమాంటిక్ సీన్లు చూసి ఇలాంటి కూతురును ఎందుకు కన్నాను అని బాధపడ్డారని సంజన వాపోయింది. అయితే అమ్మ మాత్రం నాకు సపోర్ట్ గా నిలబడిందని గుర్తు చేసుకుంది.
తన మొదటి సినిమా డైరెక్టర్ పేరు ఎత్తకుండా సంజన అతడి చేష్టలపై సంచలన నిజాలు చెప్పింది. షూటింగ్ సమయంలో అతడి ప్రవర్తన - శాడిస్లులా - సైకోలా ఉందని గుర్తు చేసుకుంది. బ్యాంకాక్ లో నది ఒడ్డున కొండపై నగ్నంగా ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ప్రమాదకరంగా తనను నిల్చోబెట్టి సీన్లు తీయించాడని ఆవేదన వ్యక్తం చేసింది. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ అంటే భయం వేసిందని సంజన తన గతాన్ని అలీతో చెబుతూ బాధపడింది.
ఇక బుజ్జిగాడు సినిమా టైంలోని ఓ సరదా సన్నివేశాన్ని సంజన గుర్తు చేసుకుంది. ఆ సినిమా షూటింగ్ టైంలో రాఘవేంద్రరావును ఉద్దేశించి సంజన ‘ఫ్రూట్ డైరెక్టర్’ అని అనడంతో మోహన్ బాబు గట్టిగా నవ్వి రాఘవేంద్రరావుకు ఫోన్ చేశాడట.. ఆయన రాగానే ఏమంటాడోనని సంజన భయపడిందట.. కానీ రాఘవేంద్రరావు గట్టిగా నవ్వేయడంతో ఊపిరిపీల్చుకున్నానని సంజన తెలిపింది. .
ప్రస్తుతం తాను ఓ డాక్టర్ తో ప్రేమలో ఉన్నానని.. అతడి పేరు మాత్రం బయటకు చెప్పను అని సంజన చెప్పుకొచ్చింది. బాహుబలి నిర్మాతలు తీస్తున్న స్వర్ణ ఖడ్గం సీరియల్ లో తాను నటిస్తున్నట్టు వెల్లడించింది.