కేన్స్ లో హీట్ పెంచుతున్న స్టార్ వైఫ్

Update: 2017-07-01 13:29 GMT
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రస్తుతం ఫారిన్ వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. మున్నాభాయ్ తన భార్యాపిల్లలతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తున్నాయి. వీటన్నిటి గురించిన అప్ డేట్స్ ను.. సంజయ్ వైఫ్ మాన్యత స్వయంగా పోస్ట్ చేస్తోంది.

రీసెంట్ గా ఈ స్టార్ వైఫ్ తన కవల పిల్లలు షాహ్రాన్.. ఇక్రాలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు.. తను హాట్ హాట్ గా కనిపించే కొన్ని పిక్స్ ను కూడా అందించింది. ఎంతో ఆనందం ఇచ్చే కంపెనీ అయిన ఫ్యామిలీతో టూర్ వేస్తే ఎలా ఉంటుందో చెప్పింది కూడా. ప్రస్తుతం సంజయ్ దత్ కుటుంబం మొత్తం కేన్స్ కి సమీపంలో ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేసేస్తున్నారు. అయితే.. అక్కడి నుంచి మాన్యతా దత్ షేర్ చేస్తున్న ఫోటోల్లో కొన్ని మరీ హాట్ గా ఉంటున్నాయి. రెడ్ కలర్ డ్రెస్ లో మరీ షార్ట్ గా ఉన్న ఔట్ ఫిట్స్ తో ఉన్న మాన్యత ఓ ఫోటోలో కనిపిస్తుంది.

ఒక స్టార్ హీరో భార్య ఇంత గ్లామరస్ పోజులు ఇవ్వడం మాత్రం సంథింగ్ స్పెషల్ అనాల్సిందే. బాలీవుడ్ లో గ్లామరస్ గా కనిపించడం సహజమే కానీ.. మరీ ఈ రేంజ్ లో అందాలను ఆరబోయడం.. పైగా అందుకు సంబంధించిన ఫోటోలను నెట్ లో షేర్  చేయడం.. ఒక్క మాన్యతా దత్ కే చెల్లింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News