హీరో అయితే నాకేంటి? పీకి ప‌డేస్తా

Update: 2016-01-08 07:30 GMT
బాలీవుడ్‌ లో డిసెంబ‌ర్ ఎండ్‌ లో రిలీజైన రెండు సినిమాలు ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌. క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజైన భాజీరావ్ మ‌స్తానీ - దిల్‌ వాలే బాక్సాఫీస్ వ‌ద్ద హోరా హోరీ న‌డిపించాయి. అయితే రేసులో దిల్‌ వాలే తోక ముడిచేస్తే భాజీరావ్ ఇప్ప‌టికీ చ‌క్క‌ని వ‌సూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఓవ‌ర్సీస్‌ లోనూ ఈ సినిమాకి ఆద‌ర‌ణ బావుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే 300 కోట్ల మార్క్ వ‌సూళ్ల‌ను ఈ సినిమా తాకింది. మునుముందు ఇంకా వ‌సూలు చేస్తుంది.
         
అయితే ఈ సినిమా సెట్‌ లో జ‌రిగిన ఓ సీన్ ఆల‌స్యంగా వెలుగు చూసింది. నిజానికి భాజీరావ్ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు సంజ‌య్ లీలా మూడు చెరువుల నీళ్లు తాగాల్సొచ్చిందిట‌. ముఖ్యంగా హీరో ర‌ణ‌వీర్‌ తో ఏదో ఒక గొడ‌వ వ‌చ్చేద‌ని చెబుతున్నారు. కొన్ని సీన్ల‌లో ర‌ణ‌వీర్ న‌ట‌న ఏమంత బాలేద‌ని తిట్టేసేవాడ‌ని, ఆ సీన్ల‌లో న‌టించేందుకు మ‌ళ్లీ మ‌ళ్లీ ప్రాక్టీస్ చేసి వ‌చ్చేవాడ‌ని చెప్పుకుంటోంది యూనిట్‌.
        
ఒకానొక సంద‌ర్భంలో అస‌లు ఈ సినిమా నుంచి నిన్ను  పీకేస్తానంటూ సంజ‌య్ లీలా ర‌ణ‌వీర్‌ ని హెచ్చ‌రించాడ‌ట‌. ఏదేమైనా చివ‌రికి ఎలాగోలా వ‌ర్క‌వుటైంది. భాజీరావ్ రిలీజై ఘ‌న‌విజ‌యం అందుకున్నాడు. ర‌ణ‌వీర్‌ కి బాగా న‌టించావ్ అంటూ పొగ‌డ్త‌లు, ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఒక‌వేళ ఇదే సీన్ రివ‌ర్స‌యితే గ‌నుక మ‌రోసారి ద‌ర్శ‌క హీరోల మ‌ధ్య గొడ‌వ‌లు రెయిజ్ అయ్యేవే.. ఒక‌రికొక‌రు తిట్టుకునేవారే.. కానీ ఫ‌లితం స‌వ్యంగానే ఉంది కాబ‌ట్టి ఆ స‌మ‌స్య రాలేదు మ‌రి.

Tags:    

Similar News