స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ 2.. వార్ జోన్‌ లో లెజెండ్‌

Update: 2019-03-04 06:46 GMT
భారీ క‌ళాఖండాల‌ రూప‌క‌ర్త‌గా సంజయ్ లీలా భన్సాలీకి పేరుంది. ఆయ‌న ఓ సినిమా తీస్తున్నారు అంటే ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో అదో క్లాసిక్ గా నిలిచిపోతుంద‌న్న ప్ర‌శంస‌లు ఉన్నాయి. భారీత‌నం.. కొత్త‌ద‌నంతో ఎమోష‌నల్ ట‌చ్ ఉన్న క‌థ‌ల్ని ఆద్యంతం ర‌క్తి క‌ట్టించేలా చూపించ‌డంలో అత‌డు అనుభవ శాలి. దీపిక‌-ర‌ణ‌వీర్-షాహిద్ త్రయంతో `ప‌ద్మావ‌త్ 3డి`తో సంచ‌ల‌నాలు సృష్టించిన భ‌న్సాలీ .. మ‌రోసారి అంత‌కుమించి సంచ‌ల‌నాల‌కు తావివ్వ‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాచారం. అయితే ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌రు కానీ, ఆయ‌న స్క్రిప్ట్ వ‌ర్క్ అందించి నిర్మాణ భాగ‌స్వామిగా భారీ చిత్రానికి రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు.

అది కూడా ఇటీవ‌ల ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన పుల్వామా- బాలా కోట్ దాడుల నేప‌థ్యంలో ఆయ‌న సినిమా చేస్తున్నారుట‌. భార‌త వైమానిక ద‌ళం ( IAF) స‌ర్జిక‌ల్ స్ట్రైల‌క్స్ 2 (బాలాకోట్) నేప‌థ్యంలో భారీ చిత్రాన్ని రూపొందించేందుకు భ‌న్సాలీ స‌న్నాహాలు చేయ‌డం తాజాగా వేడెక్కిస్తోంది. గుజారిష్, దేవ‌దాస్,   రామ్ లీల‌, ప‌ద్మావత్ ప్ర‌తిదీ ఆయ‌న తీసిన‌వ‌న్నీ సంచ‌ల‌నాలే. అందుకే అత‌డి దృష్టి ఓ వార్ సినిమాపై ప‌డింది అన‌గానే అంద‌రిలో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. ఇంత‌కీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అంటే .. ఇటీవ‌లే కేదార్‌ నాథ్ చిత్రంతో విజ‌యం అందుకున్న అభిషేక్ క‌పూర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే క‌థ‌, క‌థ‌నాల‌పై క‌స‌ర‌త్తు సాగుతోంది. ఘ‌ట‌నా స్థ‌లంలో రీసెర్చ్ ని స్టార్ట్ చేశారని ప్ర‌ఖ్యాత ప్ర‌ఖ్యాత‌ ముంబై మిర్ర‌ర్ పేర్కొంది.

అయితే పుల్వామా దాడి, అనంత‌ర ప‌రిణామాలపై సినిమాలు తీసేందుకు ఇప్ప‌టికే ఇబ్బ‌డిముబ్బ‌డిగా టైటిల్స్ ని బాలీవుడ్ ఫిలింమేక‌ర్స్ రిజిస్ట‌ర్ చేశారు. ఇండియ‌న్ మోష‌న్ పిక్చ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ అసోసియేష‌న్ (ఐఎంపీపీఏ)కు కుప్ప‌లు తెప్ప‌లుగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చి ప‌డ్డాయ‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. బాలాకోట్, స‌ర్జిక‌ల్ స్ట్రైక్ 2.0, పుల్వామా, పుల్వామా ది డే ఎటాక్, వార్ రూమ్ వంటి టైటిల్స్ రిజిస్ట‌ర్ చేశారు. దాడుల అనంత‌రం పాక్ చేతికి చిక్కి తిరిగి ఇండియాకు క్షేమంగా చేర‌గ‌లిగిన అభినంద‌న్‌పైనా సినిమాలు తీసేందుకు టైటిల్స్ రిజిష్ట‌ర్ అయ్యాయి.  వింగ్ క‌మాండ‌ర్ అభినందన్ టైటిల్ ని రిజిస్ట‌ర్ చేసేసార‌ని తెలుస్తోంది. మొత్తానికి వేడి పెరిగింది. ఇక భ‌న్సాలీ నిర్మించ‌నున్న వార్ బ్యాక్ డ్రాప్ సినిమాతో పుణ్యం పురుషార్థం కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. ఈ సినిమాతో వ‌చ్చే దాంట్లో మెజారిటీ భాగం ఆర్మీ జ‌వాన్ల కుటుంబానికి సాయంగా అంద‌జేస్తార‌ట‌. తాజా ప్ర‌చారంతో.. ఈ చిత్రాన్ని  ప‌ద్మావ‌త్ త‌ర‌హాలో 3డిలో  తీస్తారా?  600కోట్లు కొల్ల‌గొడ‌తారా? అంటూ ముచ్చ‌టా అభిమానుల్లో మొద‌లైంది.
Tags:    

Similar News