బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటరైంది కన్నడ సుందరి సంజన. అసలు పేరు అర్చన గల్రానీ అయినప్పటికీ మన దగ్గర సంజన అన్న పేరుతోనే పాపులరైంది. అందచందాలు పుష్కలంగా ఉండటంతో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా అవేవీ పెద్ద గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి. ఏడాది ఒకటి - రెండు సినిమాలు చేసినా అవెప్పుడు వచ్చింది.. ఎప్పుడెళ్లిందో ప్రేక్షకులకు గుర్తు కూడా లేదు. దీంతో సొంత ఊరు బెంగుళూరుకు రిటర్న్ అయిపోయి కాస్తో కూస్తో పేరు తెచ్చిపెట్టిన శాండల్ వుడ్ లోనే సెటిలయిపోయింది.
రీసెంట్ గా కర్ణాటకలో ఓ చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. బెంగుళూరులోని ప్రసిద్ధి చిట్ ఫండ్స్ 300 మంది కుటుంబాలను మోసం చేసి రూ. 17 కోట్ల వరకు స్వాహా చేసింది. ఇందులో మోసపోయిన బాధితుల్లో సంజన కూడా ఉంది. దీనిపై ఆమె సైలెంట్ గా ఉండకుండా సోషల్ మీడియా ద్వారా చిట్ కంపెనీ నిర్వాహకులపై యుద్ధం మొదలెట్టింది. బాధితుల్లో తన పేరు ఉందని బయటకు వచ్చినా తానేం పట్టించుకోనని.. ఈ విషయంలో సోషల్ మీడియా ద్వారా మరింత మందికి చేరాలని కోరుకుంది. ప్రసిద్ధి చిట్స్ కంపెనీ నడిపిన వాళ్లు బెంగుళూరులో లగ్జరీ లైఫ్ గడిపారని.. సొంత మెర్సిడిస్ బెంజి కారులో తిరిగారని.. బోలెడు ఆస్తులు పోగేసుకున్నారని చెప్పుకొచ్చింది. గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు పెట్టి మోసపోయానని చెప్పుకుంటూ పోస్టు పెట్టడం బాధగానే ఉన్నా అంతకు మించి ఛాయిస్ లేకుండా పోయిందని బాధగా చెబుతోంది.
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత తాజాగా సంజన దండుపాళ్యం-2 సినిమా ద్వారా తెలుగు తెరపై కనిపించింది. ఈ సినిమాలో న్యూడ్ సీన్లలో నటించిందనే ప్రచారం ద్వారా వార్తల్లో కనిపించిన సంజన ఇలా ఫైనాన్షియల్ గా మోసపోయి మరోసారి వార్తల్లోకొచ్చింది. అయితే ఈ వ్యవహారంలో తాను ఎంత నష్టపోయిందీ మాత్రం సంజన రివీల్ చేయలేదు. జస్ట్ నష్టపోయాననే విషయం.. దీనిపై తల్లితో కలిసి తాను ఎలా పోరాడుతోందో మాత్రమే తన పోస్టులో బయటపెట్టింది.