పాపులర్ హిందీ టీవీ షో ‘ద కపిల్ శర్మ’తో పాపులర్ అయిన మేల్ అండ్ ఫీమేల్ కమెడియన్లు సంకేత్ భోస్లే, సుగంధ మిశ్రా పెళ్ల పీటలెక్కారు. చాలా కాలంగా ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ.. బయట పడకుండా జాగ్రత్తపడ్డారు. ఉన్నట్టుండి పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
పంజాబ్ లోని లూథియానాలో వీరి వివాహం జరిగింది. కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో పెళ్లి జరగడంతో.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ తంతు జరిగింది. అయితే.. పెళ్లికి హాజరైన వారందరికీ ముందస్తుగా కొవిడ్ పరీక్షలు నిర్వహించడం గమనార్హం.
తమ పెళ్లి గురించి వారం క్రితమే ప్రపంచానికి వెల్లడించారు సుగంధ మిశ్రా. సంకేత్ భోస్లేతో కలిసి త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసి.. గత డిసెంబర్ నుంచే పెళ్లి పనులు మొదలు పెట్టామని చెప్పడం విశేషం.
పెళ్లికి హాజరైన వారంతా కొత్త జంటను దీవించారు. ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా న్యూ కపుల్స్ కు గ్రీటింగ్స్ చెబుతున్నారు. కాగా.. పలు ఇండస్ట్రీల్లోని సినీ సెలబ్రిటీస్ కొవిడ్ కండీషన్లోనే వివాహం చేసుకుంటున్నారు. సినిమా షూటింగులన్నీ వాయిదా పడడంతో ఇంటివద్దనే ఉంటున్నారు. దీంతో.. ఈ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి పలు జంటలు.