సంక్రాంతి పండుగ అంటే టాలీవుడ్ లో సినిమా పండుగ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ తప్పదని అందరూ భావించారు. ఎందుకంటే మూడు నాలుగు నెలల ముందు నుంచే ఫెస్టివల్ సీజన్ లో రావాలనుకున్న సినిమాలు హడావిడి మొదలుపెట్టాయి. అయితే అనూహ్యంగా పాన్ ఇండియా సినిమాలన్నీ రేసు నుంచి తప్పుకోవడంతో.. చివరకు ఒక పెద్ద చిత్రం - మూడు చిన్న సినిమాలు మిగిలాయి.
'ఆర్.ఆర్.ఆర్' 'రాధే శ్యామ్' వంటి రెండు క్రేజీ మూవీస్ పెద్ద పండక్కి రాబోతున్నామని ప్రకటించాయి. డేట్ చెప్పకపోయినా 'బంగార్రాజు' సినిమాని సంక్రాంతిని దృష్టిలో పెట్టుకునే రెడీ చేసారు. అయితే రెండు పాన్ ఇండియా చిత్రాలు పోస్టుపోన్ అవడంతో అప్పటికప్పుడు 'రౌడీ బాయ్స్' 'హీరో' 'సూపర్ మచ్చి' మూడు చిన్న సినిమాలు ఫెస్టివల్ సీజన్ కోసం కర్చీఫులు వేశాయి. పండక్కి నాలుగు సినిమాలున్నా థియేటర్లలోకి వచ్చినా 'బంగార్రాజు' మాత్రమే ప్రేక్షకుల దృష్టిని ప్రధానంగా ఆకర్షించిందని చెప్పవచ్చు.
అక్కినేని నాగార్జున - నాగచైతన్య కలిసి నటించిన చిత్రం ''బంగార్రాజు''. ఇది 2016 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వెల్. ముందు నుంచే ఇది పండుగలాంటి సినిమా.. పండుగ కోసమే తీసిన చిత్రమని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. అక్కినేని తండ్రీకొడుకులు నటించిన సినిమా కావడం.. బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ కావడంతో బజ్ క్రియేట్ అయింది.
'బంగార్రాజు' ప్రమోషనల్ కంటెంట్ కూడా ఫెస్టివల్ కు ఆడియన్స్ కోరుకునే పర్ఫెక్ట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకునేలా చేసింది. RRR - రాధేశ్యామ్ సినిమాలు తప్పుకోవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అంశమని చెప్పాలి. ఇప్పటికే యూఎస్ఏ ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కరోనా ని కేర్ చేయకుండా జనాలు థియేటర్లకు వస్తే మాత్రం ఈ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సోగ్గాళ్లు భారీ వసూళ్లు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
నేడు భోగి సందర్భంగా 'బంగార్రాజు' తో పాటుగా 'రౌడీ బాయ్స్' 'సూపర్ మచ్చి' సినిమాలు వచ్చాయి. రేపు మకర సంక్రాంతికి 'హీరో' సినిమా రాబోతోంది. అయితే 'బంగార్రాజు' పోటీని తట్టుకుని మిగతా చిన్న చిత్రాలు ఏ మేరకు ధీటుగా నిలబడతాయనేది ఆసక్తికరంగా మారింది. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన 'సూపర్ మచ్చి' సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో రిలీజ్ ఉందని కూడా చాలామందికి తెలియలేదు.
ఇక 'హీరో' సినిమాతో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా.. 'రౌడీ బాయ్స్' చిత్రంతో దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా లాంచ్ చేయబడుతున్నారు. రెండు పెద్ద సినిమాలు రేసు నుంచి తప్పుకోవడంతో సంక్రాంతి రేసులోకి వచ్చాయి. ప్రమోషన్స్ గట్టిగానే చేసారు కానీ ఆశించిన స్థాయిలో బజ్ తెచ్చుకోలేకపోయాయి. మరోవైపు సంక్రాంతి బరిలో ఉన్న ఒకే ఒక క్రేజీ మూవీ 'బంగార్రాజు' సందడి బాగానే కనిపిస్తోంది. చిన్న సినిమాలకు టాక్ బాగుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడే అవకాశం ఉంది. మరి కుర్ర హీరోలు నాగార్జున - నాగచైతన్యలకు పోటీగా నిలుస్తాయో లేదో చూడాలి.