పండగలోపే తేలిపోనున్న జాతకాలు

Update: 2018-12-28 04:47 GMT
తెలుగు సినిమా రిలీజులకు అతి పెద్ద సీజన్ సంక్రాంతి. బడా స్టార్లు.. బడా నిర్మాతలకు తప్ప ఈ సీజన్లో స్లాట్ సాధారణ ఫిలింమేకర్స్ కు దొరకడం అసాధ్యం.  ఇక సంక్రాంతి సీజన్లో ఉండే బాక్స్ ఆఫీస్ పోటీ మరే ఇతర సీజన్లో కూడా ఉండదు.  గతంలో సంక్రాంతి రిలీజ్ అంటే సినిమాకు మినిమం గ్యారెంటీ ఉండేది.  ఈమధ్య ఆ పరిస్థితి కూడా మారిపోయింది. పాజిటివ్ టాక్  రాకపోతే పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు సినిమాలను కూడా ప్రేక్షకులు పక్కన బెట్టేస్తున్నారు.

ఈసారి సంక్రాంతి రిలీజుల విషయం తీసుకుంటే జనవరి 9 - 'ఎన్టీఆర్‌ కథానాయకుడు'.. జనవరి 10 - 'పేట'.. జనవరి 11 - 'వినయ విధేయ రామ'.. జనవరి 12 - 'F2' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  ఈలెక్కన అసలు పండగకు ముందే అన్నీ సినిమాలు విడుదల అవుతాయన్నమాట.  పండగ శెలవులు మొదలయ్యే లోపే ఏ సినిమా ఎలా ఉంది అనే సంగతి తెలిసిపోతుంది.  ఇలాంటి పరిస్థితుల్లో హిట్ టాక్ వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంటుందిగానీ ఏ సినిమాకైనా నెగెటివ్ టాక్ వస్తే మాత్రం రిజల్ట్ దారుణంగా ఉంటుంది.  అంటే సంక్రాంతి పండగకు రిలీజ్ చేసినా ఏమాత్రం అడ్వాంటేజ్ లేనట్టే

ఫైనల్ గా ఈ నాలుగు సినిమాల్లో నిలబడబోయేది కంటెంట్ బాగున్న సినిమానే.  ఇప్పటికైతే నాలుగు సినిమాల మేకర్స్ తమ సినిమాల విజయం పై నమ్మకంగా ఉన్నారు. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుందో ఏ సినిమా పోటీని తట్టుకోలేక చతికిల పడుతుందో వేచి చూడాలి.  
    

Tags:    

Similar News