సంక్రాంతి పుంజుల‌పై బిగ్ బెట్టింగ్‌

Update: 2019-01-05 04:16 GMT
సంక్రాంతి పందెం ర‌స‌కందాయంలో ప‌డింది. పందెం పుంజులు పందేనికి రెడీ. ఇక క‌త్తి దూసి క‌లెక్ష‌న్ల కుమ్ముడే బ్యాలెన్స్. ఈసారి సంక్రాంతి బ‌రిలో మూడు స్ట్రెయిట్ సినిమాలు, ఒక డ‌బ్బింగ్ పేరుతోనే సుమారు రూ.200కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగింద‌ని ట్రేడ్ చెబుతోంది. అంటే ఆ మేర‌కు షేర్ వ‌సూలు చేస్తేనే హిట్లు కొట్టిన‌ట్టు.

సంక్రాంతి బ‌రిలో తొలిగా వ‌స్తున్న సినిమా క‌థానాయ‌కుడు. జ‌న‌వ‌రి 9న వ‌స్తున్న ఈ సినిమా బ‌యోపిక్ కేట‌గిరీకి చెందుతుంది. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన ఎన్నో సినిమాలు సంక్రాంతి బ‌రిలో రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్లు సాధించాయి. ఈసారి కూడా చిత్ర‌యూనిట్ తో పాటు - నంద‌మూరి అభిమానులు సంక్రాంతి విన్ కోసం ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. జ‌న‌వ‌రి 8 సాయంత్రం నుంచే ప్రీమియ‌ర్ల హ‌డావుడి మొద‌లు కానుంది. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు వ‌ర‌కూ 65కోట్ల మేర‌ బిజినెస్ చేసింద‌ని స‌మాచారం ఉంది. అంటే ఆ మేర‌కు షేర్ వ‌సూళ్లు సాధించాల్సి ఉంటుంది.

రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `విన‌య విధేయ రామ‌` జ‌న‌వ‌రి 11న రిలీజ‌వుతోంది. `క‌థానాయ‌కుడు` జోన‌ర్ తో సంబంధం లేని విధంగా ఇదో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌ టైన‌ర్ మూవీ. ఈ సినిమా ఏకంగా 92కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగించింద‌ని ప్ర‌చారం సాగుతోంది. అంటే చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` రేంజు హిట్టు కొట్టాల్సిందే. 100కోట్ల షేర్ - 200కోట్ల గ్రాస్ కి సంబంధించి పోస్ట‌ర్లు వేసే రేంజు హిట్టు కొట్టాల్సి ఉంటుంది. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ - వ‌రుణ్ తేజ్ న‌టించిన ఎఫ్ 2- జ‌న‌వ‌రి 12 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. మిగ‌తా సినిమాల‌కు ఇది పూర్తి డిఫ‌రెంట్. రొమాంటిక్ కామెడీ డ్రామాతో  హిట్ కొడతామ‌న్న ధీమాని వ్య‌క్తం చేస్తోంది టీమ్. మూడు సినిమాల‌ జోన‌ర్లు డిఫ‌రెంట్.. పందెంలో గెలిచే పుంజు ఏది? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. ఈ భారీ రిలీజ్ ల‌కు పండ‌గ సెల‌వులు ఏమేర‌కు క‌లిసొస్తుందో చూడాలి. జ‌న‌వ‌రి 10 సాయంత్రం నుంచే `విన‌య విధేయ రామ` ప్రీమియ‌ర్ల సంద‌డి నెల‌కొంటుంది. ఆ మ‌రుస‌టి రోజు ఎఫ్ 2 ప్రీమియ‌ర్ల సంద‌డి మొద‌ల‌వుతుంది. ఆంధ్రా ప్రాంతం సంక్రాంతి అల్లుళ్లకు ఎంతో స్పెషల్.. కొత్త అల్లుళ్లు భార్య‌ల‌తో క‌లిసి సినిమా థియేట‌ర్ల చుట్టూనే తిరుగుతారు. సెల‌వుల‌కు అమ్మ‌మ్మ ఇళ్ల‌కు వెళ్లిన స్కూల్ కిడ్స్ కుటుంబ స‌మేతంగా సినిమాలు చూసేందుకు ఆస‌క్తి చూపిస్తారు. ఇది ఈ మూడు సినిమాల‌కు క‌లిసి రానుంది. వీవీఆర్- 100కోట్లు - క‌థానాయ‌కుడు -65కోట్లు - ఎఫ్ 2 చిత్రం 30 కోట్ల లోపు.. ప్రీరిలీజ్ బిజినెస్ సాగించాయ‌ని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాల‌తో పాటు ర‌జ‌నీకాంత్ పేట (జ‌న‌వ‌రి 10 రిలీజ్) చిత్రం 20కోట్ల లోపు బిజినెస్ సాగించింద‌ట‌. ఆ మేర‌కు ఆ నాలుగు చిత్రాలు సుమారు 200కోట్ల వ‌ర‌కూ బిజినెస్ సాగించిన‌ట్టు. అంటే అంత పెద్ద మొత్తం షేర్ వ‌సూళ్లు సాధించాల్సిందే. గ్రాస్ అంత‌కు డ‌బుల్ అని భావించాల్సి ఉంటుంది.



Full View
Tags:    

Similar News