ఈసారి సంక్రాంతి సినిమాల సందడి మామూలుగా లేదు. పోటీ తారాస్థాయికి చేరడంతో కలెక్షన్స్ విషయంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ఫేక్ నంబర్లు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. తమ సినిమా నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేసిందని ఒకరంటే. తమ సినిమా నాన్ బాహుబలి -2 రికార్డులను బద్దలు కొట్టిందని అంటూ పోటీని రక్తికట్టించారు. తాజాగా ఈ పోటీ ఇంకా ఎక్కువై 200 కోట్ల గ్రాస్ సాధించిందని ఒకరు అంటే.. మరొకరు 220 కోట్లు అని గొప్పలు చెప్పుకున్నారు.
చిత్రమైన విషయం ఏంటంటే ఈ కలెక్షన్లు ఫేక్ అని దాదాపుగా అందరికీ తెలుసు అయినా భారీ గా ప్రచారం లోకి తీసుకొస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం తమ హీరో సినిమా కలెక్షన్స్ నమ్ముతూ పోటీలో ఉన్న మరో హీరో సినిమాలపై విమర్శలు సంధిస్తున్నారు. నిజానికి ఈ కలెక్షన్స్ ఫిగర్స్ ఎలా ఉన్నప్పటికీ అసలు కలెక్షన్స్ మాత్రం అతి తక్కువ మందికే తెలుసనే అభిప్రాయం వినిపిస్తోంది. వారెవరో కాదు.. నిర్మాతలే. 'అల వైకుంఠపురములో' కలెక్షన్స్ సంగతి అల్లు అరవింద్.. రాధా కృష్ణలకు తెలుసని.. 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ అనిల్ సుంకర.. దిల్ రాజుకు మాత్రమే తెలుసని అనుకుంటున్నారు.
గతంలో బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి నిర్మాతలకు వచ్చిన కలెక్షన్లను పెంచి బయటకు విడుదల చేసేవారు. కానీ ఈ సంక్రాంతి సినిమాలకు ట్రెండ్ మార్చారట. ఈ కలెక్షన్స్ ను డిస్ట్రిబ్యూటర్ల లెవెల్ లోనే మార్చేస్తున్నారని.. దీంతో కలెక్షన్స్ ను ట్రాక్ చేసేవారికి కూడా ఈ ఫేక్ లెక్కలే అందుబాటులోకి వస్తున్నాయని అంటున్నారు. దీంతో ఏది నిజమో ఏదో అబద్ధమో తెలియక జుట్టు పీక్కుంటున్నారట.