దివంగత దర్శకుడి కొడుక్కి ఇంకో ఛాన్స్

Update: 2016-04-22 17:30 GMT
‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలో క్రికెట్ టీం కెప్టెన్ గా కనిపించిన కుర్రాణ్ని చూసిన జనాలు.. ఎవరబ్బా ఈ కుర్రాడు చాలా బాగా చేస్తున్నాడే అనుకున్నారు. ఆ తర్వాత ‘బంగారు కోడిపెట్ట’ సినిమాలోనూ మంచి పాత్రతో మెప్పించాడా కుర్రాడు. ఈ మధ్యే ‘తను నేను’ అనే సినిమాతో హీరోగానూ అరంగేట్రం చేశాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ పేరు సంతోష్ శోభన్. దివంగత దర్శకుడు శోభన్ కొడుకే ఈ సంతోష్.

తాను హీరోగా అరంగేట్రం చేసిన ‘తను నేను’ మీద గౌతమ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ.. అవి నెరవేరలేదు. ‘ఉయ్యాల జంపాల’ నిర్మాత రామ్మోహన్ దర్శకుడిగా మారి తీసిన తొలి సినిమా మీద విడుదలకు ముందు మంచి అంచనాలే నెలకొన్నాయి కానీ.. సినిమా ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఐతే శోభన్ నటన మాత్రం అందరినీ ఆకట్టుకుంది. కుర్రోడికి మంచి భవిష్యత్ ఉందన్న ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ ఫీడ్ బ్యాక్ చూసే సంతోష్ కు ఇంకో ఛాన్స్ తెచ్చిపెట్టింది.

సింప్లీ జిత్‌ ప్రొడక్షన్స్‌ అనే కొత్త నిర్మాణ సంస్థ.. క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌ గా పని చేసిన అనుభవమున్న శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతోంది. శోభన్ కూడా కృష్ణవంశీ దగ్గర పని చేసిన వాడే. ఆ పరిచయంతోనే శోభన్ కొడుకు హీరోగా సినిమా చేయబోతున్నాడు శ్రీనివాస్ చక్రవర్తి. ఈ చిత్ర షూటింగ్‌ జూన్‌ నెలలో మొదలవుతుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత అభిజిత్‌ జయంతి తెలిపారు.
Tags:    

Similar News