30లోకి వ‌చ్చేశానోచ్ అంటూ సంబ‌ర‌ప‌డుతోంది కానీ!

Update: 2022-02-26 14:30 GMT
పాతిక ప్రాయంలోనే నేము ఫేము వ‌చ్చేస్తే 30 ప్రాయానికే కోట్లు వెన‌కేస్తున్నారు ముంబై క‌థానాయిక‌లు. ఇలా మోడ‌లింగ్ నుంచి అలా సినీరంగంలో అడుగుపెడుతున్నారు. కోట్ల‌కు కోట్లు పారితోషికాలు అందుకుంటున్నారు. రంగుల మాయా ప్ర‌పంచాన్ని ఈదే తెలివితేట‌లు ర్యాంప్ వాక్ గాళ్స్ కి చాలా ఉంటాయి కానీ.. సాన్యా మ‌ల్హోత్రాలాంటి ట్రెడిష‌న‌ల్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన గాళ్ ఇక్క‌డ ఎద‌గాలంటే చాలా స‌వాళ్లు ఎదుర్కోవాలి.

కానీ మ‌ల్హోత్రాజీ అన్ని స‌వాళ్ల‌ను ఎదుర్కొని ఎట్ట‌కేల‌కు క‌థానాయిక‌గా త‌న హ‌వా ఏంటో చూపిస్తోంది. అయితే నేటితో సన్యా మల్హోత్రాకు 30 ఏళ్లు. 30లోకి వ‌చ్చేశానోచ్ అంటూ తెగ సంబ‌ర‌ప‌డిపోతోంది. నిజానికి ఈ ఏజ్ డేంజ‌ర్ అలార్మ్ లాంటిది. బార్డ‌ర్ క్రాస్ అవుతున్న‌ట్టే లెక్క‌. ఇక పెళ్లితో ఒక ఇంటిది అవ్వాల‌ని ఇంట్లో పోరు ఉంటుంది. కానీ దీనికి సాన్యా ఎలాంటి సొల్యూష‌న్ క‌నిపెడుతుందో చూడాలి. ఇక సాన్యా బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న ఫ్రెండు అనన్య పాండే విషెస్ తెలిపింది. తన గాళ్ క్రష్ అని పిలిచేసే అన‌న్య శుభాకాంక్ష‌లు తెలిపింది. కృతి సనన్ కూడా విషెస్ చెబుతూ ఇన్న‌ర్ బ్యూటీ అని పొగిడేసింది. సన్యా మల్హోత్రా  30వ పుట్టినరోజు సంద‌ర్భంగా అనన్య పాండే- కృతి సనన్ ల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు ప్ర‌ముఖులు ఆమెకు హృదయపూర్వక పోస్ట్ లతో శుభాకాంక్షలు తెలిపారు.

ల‌వ్ హాస్ట‌ల్ లో వండ‌ర్ గాళ్..

సన్యా మల్హోత్రా - విక్రాంత్ మాస్సే - బాబీ డియోల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన‌ క్రైమ్ థ్రిల్లర్ లవ్ హాస్టల్ ఈ రోజు  ఫిబ్రవరి 25న Zee5లో ప్రదర్శిత‌మైంది. ఈ రోజు సన్యా మల్హోత్రా 30వ పుట్టినరోజు స్పెష‌ల్ గా ఇది విడుద‌ల‌వ్వ‌డం ఆస‌క్తిక‌రం. ఈ చిత్రంలో సాన్యా న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.
Tags:    

Similar News