కుస్తీ పిల్ల స్పీడు పెంచింది

Update: 2018-06-30 04:30 GMT
అమీర్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దంగల్ ఇండియాలోనే కాదు... చైనా ప్రేక్షకులకు సైతం తెగ నచ్చేసింది. అందుకే బాహుబలి తరవాత అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డు దంగల్ కు వచ్చింది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ ఇద్దరు కూతుళ్లకు తండ్రిగా కనిపిస్తాడు.

ఇందులో అమీర్ ఖాన్ చిన్న కూతురుగా చేసింది సాన్యా మల్హోత్రా. దంగల్ సినిమాతో ఈ భామకు బాగానే గుర్తింపు వచ్చింది. ఆ తరవాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న సాన్యా ఇప్పుడు జోరు పెంచింది. ఈ ఏడాది ఆమె నటించిన సినిమాలు రెండు ప్రేక్షకులు ముందుకు రానున్నాయి. ఈ రెండూ డిఫరెంట్ సబ్జెక్టులతో తెరకెక్కుతున్న చిత్రాలు కావడం విశేషం. ముందుగా విశాల్ భరద్వాజ్ డైరెక్షన్ లో పటాఖా సినిమా రానుంది. ఈ సినిమా పెళ్లితో ఇద్దరు అక్కచెల్లెళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులొచ్చాయి  అన్న కాన్సెప్ట్ తో వస్తోంది. ఈ మూవీ కోసం సాన్యా కాస్తంత బరువు పెరిగి బొద్దుగా తయారైంది.

ఈ ఏడాది దసరాకు సాన్యా నటించిన రెండో సినిమా థియేటర్లకు రానుంది. బధాయి హో టైటిల్ లో వస్తున్న ఈ మూవీలో వికీ డోనర్ ఫేం ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. ఇందులో సాన్యా మోడ్రన్ గర్ల్ గా కనిపించనుంది. వరసగా ఒకేసారి రెండు సినిమాలు కంప్లీట్ చేయడమంటే ఈసారి కుస్తీ చేయాల్సిన పనిలేదు కాబట్టి అంత కష్టం లేదంటూ ఆన్సరిస్తోంది. 
Tags:    

Similar News