కామెడీ వేషాలతో మాంచి ఊపు మీద ఉండగానే హీరోగా మారాడు సప్తగిరి. ఇప్పటికే అతను హీరోగా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’.. ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ సినిమాలు చేశాడు. ఇప్పుడు తన మూడో సినిమాకు రెడీ అవుతున్నాడు. తొలి రెండు సినిమాలకు రీమేక్స్ ట్రై చేసిన సప్తగిరి.. ఈసారి డైరెక్ట్ మూవీ చేయబోతున్నాడు. ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’.. ‘సీతారాముల కళ్యాణం.. లంకలో’.. ‘సెల్ఫీ రాజా’ సినిమాలు రూపొందించిన ఈశ్వర్ దర్శకత్వంలో అతను నటించబోతున్నాడు.
విక్రమ్ రాజ్ అనే రచయిత ఈ చిత్రానికి కథ అందించగా.. ఫేమస్ రైటర్ డైమండ్ రత్నబాబు మాటలు రాస్తున్నాడు. స్క్రిప్టు వర్క్ దాదాపుగా పూర్తయింది. సప్తగిరి హీరోగా తొలి రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేసిన రవికిరణే ఈ చిత్రాన్ని కూడా నిర్మించే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి కూడా సప్తగిరి పేరుతోనే టైటిల్ పెట్టే ఆలోచనలోనే ఉన్నారట.
కథానాయకుడిగా సప్తగిరి తొలి సినిమా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’కు ఏమంత గొప్ప టాక్ రాలేదు కానీ.. వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. ఐతే రెండో సినిమా ‘సప్తగిరి ఎల్ ఎల్బీ’ మాత్రం తేడా కొట్టేసింది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ పర్వాలేదు కానీ.. తర్వాత అది నిలబడలేదు. దీని తర్వాత ‘సప్తగిరి-సన్నీ లియోన్’ అంటూ ఒక సినిమా ఏదో చేస్తాడని ప్రచారం జరిగింది కానీ.. అదేం లేదని తర్వాత తేలింది. మరి ఈశ్వర్ దర్శకత్వంలో నటించబోయే సినిమా సప్తగిరికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.