కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి.. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఓవైపు కామెడీ రోల్స్ చేస్తూనే.. మరోవైపు అవకాశం వచ్చినప్పుడు హీరో పాత్రలు పోషిస్తున్నారు.
ఈ క్రమంలో 'సప్తగిరి ఎల్ఎల్‌బి' 'వజ్రకవచధర గోవింద' వంటి సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. ఇప్పుడు హీరోగా తనదైన శైలి నటనతో మెప్పించడానికి.. "గూడుపుఠాణి" అనే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సప్తగిరి.
"గూడుపుఠాణి" చిత్రంలో సప్తగిరి సరసన '90ఎమ్ఎల్' ఫేమ్ నేహా సోలంకి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి కె.యమ్. కుమార్ దర్శకత్వం వహించారు. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి - కటారి రమేష్ యాదవ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధం అయింది.
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న 'గూడుపుఠాణి' చిత్రాన్ని గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఒక టెంపుల్ లో ఒకరోజులో జరిగే కథాంశంతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని రూపొందించారు.
ఓ గుడిలో బంధీలైన హీరోహీరోయిన్లు అందులోంచి ఎలా బయట పడ్డారు? వారిని గుడిలో ఎవరు బంధించారు? ఎందుకు బంధించారు? అనే అంశాలను ఆసక్తికరంగా తెరకెక్కించామని చిత్ర బృందం చెబుతోంది.
'గూడుపుఠాణి' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ట్రైలర్ ఆసక్తిని కలిగించాయి. ఇందులో ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ రఘు కుంచె విలన్ గా కనిపించబోతున్నారు.
'పలాస 1978' తర్వాత రఘు కుంచెం నెగిటివ్ రోల్ చేస్తున్న సినిమా ఇది. ప్రదీప్ విద్య ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. పవన్ చెన్నా ఛాయాగ్రహణం అందించారు. నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ సినిమాతో హీరోగా సప్తగిరి మరో కమర్షియల్ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.