దర్శకత్వ విభాగంలో పని చేసి అనుకోకుండా నటులైన కొందరు ఆర్టిస్టుల్ని టాలీవుడ్లో చూడొచ్చు. అందులో నాని.. అల్లరి నరేష్ లతో పాటు సప్తగిరి కూడా ఉన్నాడు. అతను సినీ రంగంలోకి ప్రవేశించింది అసిస్టెంట్ డైరెక్టర్ గానే. రెండంకెల సంఖ్యలో సినిమాలకు దర్శకత్వ విభాగంలో పని చేశాడు సప్తగిరి. ఐతే ‘పరుగు’ సినిమాతో అనుకోకుండా నటుడిగా మారిన సప్తగిరి.. ఆపై కమెడియన్ గా స్టార్ స్టేటస్ సంపాదించాడు. ఆపై హీరో అవతారం కూడా ఎత్తేశాడు. హీరోగా తాను చేసిన రెండు సినిమాలు అంత గొప్ప ఫలితాన్నేమీ ఇవ్వకపోయినప్పటికీ కథానాయకుడిగానే కొనసాగుతున్నాడు సప్తగిరి.
విశేషం ఏంటంటే ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’.. ‘సప్తగిరి ఎల్ ఎల్బీ’ రెంటికీ కొంత వరకు రచనా సహకారం కూడా అందించాడతను. ఇప్పుడు తన కొత్త సినిమాకు అతనే సొంతంగా పూర్తి స్క్రిప్టు సమకూరుస్తుండటం విశేషం. ఇప్పటికే ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ ఫేమ్ ఈశ్వర్ దర్వకత్వంలో ఒక సినిమా కమిటైన సప్తగిరి.. దీని తర్వాత ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ఫేమ్ అరుణ్ పవార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రానికి సప్తగిరే స్వయంగా కథ రాయడమే కాక స్క్రీన్ ప్లే సహకారం కూడా అందిస్తున్నాడట. చూస్తుంటే భవిష్యత్తులో సప్తగిరి దర్శకుడిగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. రవికిరణ్ లాంటి నిర్మాతలు దొరికితే అన్నీ తానై సినిమాలు తీసుకుంటాడేమో సప్తగిరి.