హేయ్ నువ్వు ఏసేశావ్!! అన్నట్లుంది మన కమెడియన్ల పరిస్థితి. ప్లానింగ్ లోపమో లేకపోతే కాస్త ఎక్కువగా సంపాదించేయాలనో తెలియదు కాని.. చేతులు కాల్చుకోవడంలో మనోళ్లు నిష్ణాతులు అయిపోతున్నారు. ఇదిగో ఇప్పుడు సప్తగిరి పరిస్థితి కూడా అలాగే ఉంది.
సంక్రాంతి తరువాత మనోడు ఏంటో మాయం అయిపోయాడు అని చెప్పుకున్నాంగా.. ఇతగాడు హీరోగా ఒక సినిమాను రూపొందించే పనిలో బిజీగా ఉన్నాడట. అతని స్నేహితులే నిర్మాతలు. అయితే టాలీవుడ్ లో ఉన్న ఒక సెంటిమెంట్ ఏంటంటే.. కమెడియన్లు హీరోలుగా ఎంత ప్రయత్నించినా కూడా అవి ఎందుకు ఓవర్ కాన్ఫిడెంట్ ప్రాజెక్టులుగా మిగిలిపోయాయ్. మొన్నామధ్యన ధనరాజ్ ఓ రెండు సినిమాలు తీశాడు.. రెండూ ఫ్లాపే. వెన్నెల కిషోర్ కూడా ఒకటి తీశాడు. అదీ ఫ్లాపే. ఒక్కోసారి హీరోగా కాకుండా.. డైరక్షన్ కూడా వీరే చేసేశారు. జబర్ దస్త్ బ్యాచ్ నుండి వచ్చిన వేణు - షకలక శంకర్ లు కూడా ఏదో ప్రయత్నించారు. అన్నీ ఫెయిలే అయ్యాయ్. కట్ చేస్తే ఇప్పుడు సప్తగిరి కూడా ఏసేశాడు యీరో యాషం.
గతంలో బ్రమ్మీ - ఆలీ - ఏవిఎస్ లు కూడా హీరోలుగా మెరవాలని ప్రయత్నించే వాళ్ళ గోల్ వాళ్ళే వేసుకున్నారు తప్పించి మెప్పించలేకపోయారు. చూద్దాం సప్తగిరి పరిస్థితి ఏమవుతుందో!!