సప్తగిరి.. జస్ట్ హీరో కాదు

Update: 2016-12-23 01:30 GMT
టాలీవుడ్లో కమెడియన్లు హీరోలవడం కొత్త కాదు. బ్రహ్మానందం.. ఆలీ.. సునీల్.. ఇలా చాలామంది హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు సప్తగిరి వంతు వచ్చింది. అతను కథానాయకుడిగా తెరకెక్కిన తొలి సినిమా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ఈ రోజే  ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా విషయంలో సప్తగిరి చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. అందుకే వంగవీటి.. ఒక్కడొచ్చాడు.. పిట్టగోడ లాంటి సినిమాలు రేసులో ఉన్నా పోటీకి సై అన్నాడు. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు సప్తగిరి కేవలం హీరో మాత్రమే కాదు.. రచయిత కూడా. తమిళ రీమేక్ అయిన ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’కు స్క్రీన్ ప్లే సహకారం కూడా అందించాడట సప్తగిరి.

‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ టైటిల్స్ లో అడిషనల్ స్క్రీన్ ప్లే క్రెడిట్ సప్తగిరికే ఇచ్చారట. ఈ చిత్రం తమిళంలో హిట్టయిన ‘తిరుడన్ పోలీస్’ అనే సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసింది సప్తగిరేనట. అందుకే అడిషనల్ స్క్రీన్ ప్లే క్రెడిట్ అతడికి ఇచ్చారు. నటుడు కావడానికి ముందు సప్తగిరి ఏడేళ్ల పాటు దర్శకత్వ శాఖలో పని చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’లో ప్రేక్షకులు ఆశించే అన్ని రకాల అంశాలూ ఉన్నాయని.. తండ్రీ కొడుకుల సెంటిమెంటు సినిమాకు మేజర్ హైలైట్ అని అంటున్నాడు సప్తగిరి. హీరో కాబట్టి తాను ఈ సినిమాలో డ్యాన్సులు ఫైట్లు చేయలేదని.. అవి సినిమాకు అవసరం అనిపించాయని.. తనలోని అన్ని టాలెంట్లనూ ఈ సినిమాలో చూపించాని.. అవి అప్ టు ద మార్క్ ఉన్నాయో లేదో ప్రేక్షకులే చెప్పాలని సప్తగిరి అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News