స్టార్ డాట‌ర్ తొలి ఫెయిల్యూర్

Update: 2018-12-07 08:08 GMT
హిందూ- ముస్లిమ్ ప్రేమ‌క‌థ .. పేద‌- ధ‌నిక ప్రేమ‌క‌థ అన‌గానే బోలెడ‌న్ని సినిమాలు గుర్తుకొస్తాయి. జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించిన  దృశ్య‌కావ్యం టైటానిక్‌ తో పాటు బొంబాయి - తాజ్ మ‌హ‌ల్‌ - సైరాఠ్ ఇంకా ఎన్నో క్లాసిక్ సినిమాలు అన్ని భాష‌ల్లోనూ వచ్చి స‌క్సెస‌య్యాయి. ఇటీవ‌లే రిలీజైన సైరాఠ్ అనే చిన్న చిత్రం 100కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. పేద‌రికం - మ‌తాంత‌ర ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. ఆ సినిమాకి రీమేక్‌ గా వ‌చ్చిన `ధ‌డ‌క్` విజ‌యం సాధించింది. ఈ చిత్రంతోనే అతిలోక సుంద‌రి జాన్వీ క‌థానాయిక‌గా రంగ ప్ర‌వేశం చేసింది. న‌టించిన తొలి సినిమాతోనే జాన్వీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. క‌ర‌ణ్ జోహార్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ త‌న‌ని తెర‌కు ప‌రిచ‌యం చేయ‌డం ప్ల‌స్ అయ్యింది.

ఇప్పుడు మ‌రో స్టార్ కిడ్ న‌టించిన సినిమా రిలీజైంది. సైఫ్ అలీఖాన్ - అమృత జంట‌ కుమార్తె సారా అలీఖాన్ న‌టించిన కేదార్‌ నాథ్ నిన్న థియేట‌ర్ల‌లోకి రిలీజైంది. ఈ ట్రాజిక్‌ ప్రేమ‌క‌థా చిత్రానికి మిక్స్‌డ్ రివ్యూలు వ‌చ్చాయి. కొంద‌రు బావుంది అని రాస్తే - మ‌రికొంద‌రు చెత్త‌గా ఉందంటూ రాసారు. అయితే అంద‌రూ ముక్త‌కంఠంతో సారా అందం న‌చ్చింద‌ని - సుశాంత్ సింగ్ న‌ట‌న బావుంద‌ని.. సారా న‌ట‌న‌ప‌రంగా ఇంకా మెరుగ‌వ్వాల్సి ఉంద‌ని సూచించారు. ఇక కేదార్‌ నాథ్ నేప‌థ్యంలో సాగే ఈ ప్రేమ‌క‌థ‌లో కొత్త‌గా ఏం లేద‌న్న విమ‌ర్శ‌లు గుప్పించారు.

హిమాల‌యాల్లోని అంద‌మైన ప్ర‌కృతి.. యాత్రికులు తిరిగే చోట ఒక పేద ముస్లిమ్ అబ్బాయిని ప్రేమించే ధ‌నిక హిందూ అమ్మాయి ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కిన‌ చిత్ర‌మిది. అందులోనే కేదార్‌ నాథ్ వ‌ర‌దల భీభ‌త్సాన్ని గ్రాఫిక్స్‌ తో మిక్స్ చేసి అభిషేక్ క‌పూర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. హిందూ- ముస్లిమ్ .. పూర్- రిచ్ ప్రేమ‌క‌థను ఎంచుకున్నా ఎందుక‌నో సినిమా ఆక‌ట్టుకోలేక‌పోయిందంటూ విమ‌ర్శించారు. ఈ సినిమాకి `సైరాఠ్‌` ఫార్ములాని అనుస‌రించాల‌ని చూసినా కానీ వ‌ర్క‌వుట్ కాలేద‌ని అన్నారు. అయితే డెబ్యూ సినిమా స‌క్సెసైనా - ఫెయిలైనా సైఫ్ డాట‌ర్ సారా మాత్రం ఆక‌ట్టుకుంద‌న్న‌ది ఓ రిపోర్ట్. సారా న‌టించిన తొలి సినిమా రిలీజ్ కాక‌ముందే త‌న‌కు వీర‌లెవ‌ల్లో యువ‌త‌రంలో పాలోయింగ్ ఏర్ప‌డింది. సారా మ‌ద‌ర్ అమృత సింగ్ సైతం తన కెరీర్‌ని ఇలాంటి ఓ ప్రేమ‌క‌థా చిత్రంతోనే ప్రారంభించిన సంగ‌తిని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.
   

Tags:    

Similar News