గత కొన్ని నెలలగా బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలు సాధిస్తున్న వసూళ్లపై ఆసక్తికర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వందల కోట్లు, వేల కోట్లని క్రాస్ చేస్తూ క్రేజీ చిత్రాలు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో సినిమాల వసూళ్లు నిత్యం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే భారీ వసూళ్లపై బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సారా అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది సారా అలీఖాన్. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
ధనుష్ - అక్షయ్ కుమార్ తో కలిసి గత ఏడాది 'అత్రంగీరే' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సారా అలీఖాన్ ప్రస్తుతం రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది.
'మిమి' ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ తో ఓ మూవీ, 'గ్యాస్ లైట్' చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటికే లక్ష్మణ్ ఉటేకర్ తో చేస్తున్న మూవీ పూర్తి కాగా 'గ్యాస్ లైట్' చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కలెక్షన్లతో పాటు ప్రొడ్యూసర్లపై సారా అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. సినిమా రిలీజ్ తరువాత సాధించే కలెక్షన్ లకు మాకు ఎలాంటి సంబంధిం వుండదని, అవి మొత్తం ప్రొడ్యూసర్ లకు, డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే చెందుతాయని స్పష్టం చేసింది.
సినిమా బాక్సాఫీస్ వద్ద వసూలు చేసే మొత్తం నిర్మాతలకే చెందుతాయని, అందులో మాకు వచ్చేది ఏమీ లేదని, నిర్మాలు, డిస్ట్రిబ్యూటర్లకే అవి చెందుతాయని తెలిపింది. కలెక్షన్స్ తో మాకు ఎలాంటి సంబంధిం వుందని క్లారిటీ ఇచ్చింది.
ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ లు, పాత్రల గురించి మాట్లాడుతూ ' నాకు సంజయ్ లీలా భన్సాలీ మూవీస్ అంటే ఇష్టమని, ఆయన సినిమాల్లో మహారాణి పాత్రల్లో నటించాలని వుందని, అంతే కాకుండా జోయా అక్తర్ సినిమాల్లోని మోడ్రన్ లేడీ పాత్రలంటే తనకు చాలా ఇష్టమని, అలాంటి పాత్రల్లో కనిపించాలని వుందని తన మనసులో మాటని బయటపెట్టింది.