చెప్పేది చెయిన్ గురించే.. చూపేది మాత్రం..

Update: 2017-03-12 07:02 GMT
పవన్ కళ్యాణ్ మూవీ పంజాలో కనిపించిన సారా జేన్ డియాజ్ గుర్తుందా.. కొంకణి ఫ్యామిలీకి చెందిన ఈ మస్కట్ భామ.. 2007లో మిస్ ఇండియా కూడా. అంతకు ముందే మిస్ ఇండియా ఒమన్ టైటిల్ కూడా నెగ్గేసిన అందగత్తే సారాజేన్.

ప్రస్తుతం బాలీవుడ్ లో కెరీర్ కంటిన్యూ చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో చెప్పినదంతా తను ధరించిన వెరైటీ చైన్ గురించే. రకరకాలుగా ఆ చైన్ ను వాడుకోవచ్చని.. నెక్లేస్ లా ఉపయోగించవచ్చని తెగ చెప్పేసింది. చివర్లో హ్యాపీ వీకెండ్ కూడా చెప్పింది కానీ.. వీటితో పాటు అమ్మడు షేర్ చేసిన ఫోటోనే అసలు టాపిక్. తన కాళ్ల అందాలను ఎగ్జిబిట్ చేస్తూ.. బెడ్ పై నుంచి దిగకుండానే భలే పోజ్ ఇచ్చేసింది.

వయ్యారాల విషయంలో ఈ మాజీ మిస్ ఇండియా దగ్గర కొదువేమీ లేదు. అలాగే వాటిని ప్రదర్శించడంలో కూడా పెద్దగా అభ్యంతరాలు ఏమీ ఉండవు. కాకపోతే ఈ భామకు ఇంకా కాలం కలిసి రాలేదంతే. ప్రస్తుతం ఈమె చేతిలో ఒకటే సినిమా ఉందంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News