బాలీవుడ్ లో వరుసగా సినిమాలతో దూసుకు పోతున్న ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్. అప్ కమింగ్ హీరోయిన్ గా సారా అలీఖాన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ సమయంలో ఈ అమ్మడు నెటిజన్స్ కు టార్గెట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఒక ఫొటో కు నెటిజన్స్ విపరీతమైన బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఆమె గురించి బూతులు తిడుతూ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పేరు మార్చుకోమని కొందరు మతం పేరుతో ఆమెను టార్గెట్ చేస్తుండగా మరి కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి ఆమె సరదాగా విహార యాత్రకు వెళ్లి అక్కడ దైవ దర్శణంకు వెళ్లగా అది కాస్త వివాదాస్పదం అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ తన స్నేహితురాలు కమ్ మరో హీరోయిన్ అయిన జాన్వీ కపూర్ తో కలిసి కేథార్ నాథ్ కు వెళ్లింది. సారా మొదటి సినిమా కేథార్ నాధ్. ఆ సినిమా సమయంలోనే చాలా విమర్శలు ఎదుర్కొంది. ఆ సినిమా షూటింగ్ కోసం చాలా రోజులు కేథార్ నాథ్ లో సారా అలీ ఖాన్ ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో అక్కడి వాతావరణంను చాలా ఆస్వాదించిన సారా ఈసారి జాన్వీ కపూర్ తో కలిసి వెళ్లింది. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ అక్కడకు వెళ్లిన నేపథ్యంలో సారా అలీ ఖాన్ మరియు జాన్వీ కపూర్ ల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు కలిసి కేథార్ నాథ్ ఆలయంను కూడా సందర్శించడమే అసలైన గొడవకు దారి తీసింది.
జాన్వీ కపూర్ తో కలిసి సారా దిగిన కేథార్ నాథ్ ఫొటోను షేర్ చేసింది. ఆ పొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ అనే విషయం తెల్సిందే. ముస్లీం యువతి అయిన సారా అలీ ఖాన్ హిందూ దేవాలయంకు ఎలా వెళ్తుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సారా పై ముస్లీంలతో పాటు హిందువులు కూడా విమర్శలు చేస్తున్నారు. ముస్లీం వి కాకుంటే వెంటనే పేరు మార్చుకో అంటూ కొందరు... హిందువు అయితే నిరూపించుకో అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఆమెను బ్యాడ్ పదాలతో దూషించడం మొదలు పెట్టారు. మొత్తానికి హీరోయిన్ కేథార్నాథ్ యాత్ర ఇలా వివాదాస్పదం అయ్యింది.