పవన్‌ హీరోయిన్‌ కిలాడీ బాబోయ్‌

Update: 2015-07-17 23:00 GMT
ఏదైనా ఈవెంట్‌ లో మన మెరుపులు మెరవాలంటే.. రెండే రెండు పద్దతులు. అయితే మన వేసుకున్న డిజైనర్‌ డ్రస్‌ అదిరిపోయాలి, లేకపోతే స్కిన్‌ షో కేకలు పెట్టించేయాలి. కొంతమంది హీరోయిన్స్‌ సినిమాల్లో పెద్దగా రాణించకపోయినా కూడా మోడలింగ్‌ సర్క్యూట్స్‌ లో అరిపించేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే.. వారి బాడీ లాంగ్వేజ్‌, దాన్ని ప్రెజెంట్‌ చేసే తీరు.

అక్కడ చూడండి.. ఈ పిల్ల పేరు సారా జేన్‌ డయాస్‌.. మాజీ మిస్‌ ఇండియా.. సినిమాల్లో ట్రై చేసి ఫెయిలైంది. తెలుగులో పంజా సినిమాలో పవన్‌్‌కళ్యాణ్‌ సరసన హీరోయిన్‌గా చేసినా ఎందుకో పెద్దగా పేరు రాలేదు. అయితే ఈ పిల్ల ఫ్యాషన్‌ సర్క్యూట్లలో మాత్రం ఫుల్‌ బిజీ. కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌ నుండి పెద్ద పెద్ద బ్రాండ్ల తాలూకు లాంచింగ్స్‌ వరకు ఎక్కడ చూసినా సారా జేన్‌ దర్శనమిస్తుంటుంది. ఈమెకు లక్షల్లో పేమెంట్‌ ఇచ్చి మరీ రంగంలోకి దించుతుంటారు. దానికి కారణం ఆమె బాడీ లాంగ్వేజేనట.

ఈ పిల్ల నిన్న లక్మే ఫ్యాషన్‌ వీక్‌ వింటర్‌ కలెక్షన్‌ కోసం ఆడిషన్స్‌ జరుగుతుంటే.. అక్కడకు జడ్జ్‌ గా విచ్చేసింది. ఒక న్యాయనిర్ణేత ఇంత హాట్‌గా ఉంటే మరి చుట్టూ పాల్గొన్న మోడల్స్‌ ఎంత హాట్‌గా ఉండాలి? అబ్బే అంతలేదు.. నాభి అందాలను ఆరబోస్తూ ఈవిడే అందరినీ బీట్‌ చేసిపాడేసింది. కిలాడీ బాబోయ్‌.
Tags:    

Similar News