'పంజా' హీరోయిన్ బికినీ హంగామా

Update: 2017-01-02 13:35 GMT
పవన్ కళ్యాణ్ మూవీతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన బ్యూటీ సారా జేన్ డియాజ్. ఆ మూవీ ఫ్లాప్ కావడంతో ఈ భామకు మళ్లీ పెద్దగా అవకాశాలు రాలేదు. బాలీవుడ్ పై కన్నేసిన ఈ బ్యూటీ.. పెద్దగా ఇక్కడ ప్రయత్నాలు కూడా చేయలేదు.

ఇంకా కెరీర్ కి బ్రేక్ వచ్చేసే సినిమా ఏదీ చేయలేదు కానీ.. ఏడాది ఒకట్రెండు సినిమాల్లో అయినా కనిపిస్తూ కెరీర్ కంటిన్యూ చేస్తోంది ఈ మస్కట్ బ్యూటీ. ప్రస్తుతం హాలీడే టూర్ లో ఉన్న సారా జేన్.. బీచ్ లలో బికినీలతో హంగామా చేసేస్తోంది. టూ పీస్ బికినీతో ఈ భామ దర్శనం ఇస్తూ.. అందాలను బీచ్ ఒడ్డున చిందిస్తోంది. మరి ఇంత అందగత్తె బీచ్ లో ఒయ్యారాలు ఒలికిస్తూ తిరగడంతో పాటు.. చేతిలో ఓ మగ్ లాంటిది పట్టుకుంది. మళ్లీ ఈ మగ్ ను చూసి ఇంకోటేదైనా అనుకుంటారని భావించిందేమో.. క్లారిటీ కోసం 'కొబ్బరి నీళ్లు.. మీ అమ్మాయి ఆరోగ్యానికి చాలా మంచిది' అంటూ క్లాసుల్లాంటివి చెబుతోంది.

34 ఏళ్ల సారాజేన్ డియాజ్.. ఇంత వయసులోనూ ట్వంటీస్ అన్నట్లుగా మెరిసిపోవడానికి బహుశా అసలు రహస్యం ఇదేనేమో. కొబ్బరినీళ్లతో కూడా అందం ఇనుమడింపచేసుకోవచ్చని చెబుతున్న ఈ సుందరి మాటలను ఫ్యాన్స్ ఫాలో అవుతారంటారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News