2.5 కోట్లమందికి చేరిన 'సారంగదరియా'.. మోత మోగుతోందిగా!

Update: 2021-06-22 17:30 GMT
ఈ మధ్యకాలంలో సినిమాలకంటే సినిమా పాటలు ఎక్కువగా సినిమాలకు క్రేజ్ తీసుకొస్తున్నాయి. సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ పాటలు మాత్రం ఓ రేంజిలో మోత మోగిస్తున్నాయి. యూట్యూబ్ లో ఓ సాంగ్ వంద మిలియన్స్ వ్యూస్ దాటింది అంటేనే రికార్డులా భావించే సమయంలో ఓ తెలుగు సాంగ్ ఏకంగా 250 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుందంటే మరి టాలీవుడ్ చరిత్రలోనే ఇది మొదటి రికార్డుగా భావించవచ్చు. అందులోను అది హీరోయిన్ సాంగ్ మాత్రమే హీరో ఉండడు.. ఎలాంటి డ్యూయెట్ కాదు. కానీ పాటలో ఆ దమ్ము ఉందని నిరూపించింది.

దాదాపు నాలుగు నెలలుగా యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది లవ్ స్టోరీ సినిమాలోని 'సారంగదరియా' సాంగ్. అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీలోని ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీ రికార్డులను హిట్స్ బ్రేక్ చేసేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న విడుదలైన ఈ పాట.. అప్పటినుండి యూట్యూబ్ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుండి ప్రస్తుతం సారంగదరియా సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్ అయింది.

దమ్మున్న జానపద పాటగా తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న ఈ పాటను టాలెంటెడ్ మంగ్లీ ఆలపించగా.. సుద్దాల అశోక్ తేజ మోడరన్ లిరిక్స్ అందించారు. ఈ పాటలో కేవలం హీరోయిన్ సాయిపల్లవి మాత్రమే కనిపిస్తుంది. మరి 250 మిలియన్స్ మార్క్ దాటింది అంటే రికార్డు ఆమెకే క్రెడిట్ అవుతుందా లేకపోతే సంగీతం అందించిన పవన్ కు చేరుతుందా.. లేక క్రియేటర్స్ శేఖర్ కమ్ముల - సుద్దాల అశోక్ తేజలకు క్రెడిట్ దక్కుతుందా అనేది తెలియాలి. కానీ మొత్తానికి సాంగ్ క్రెడిట్ అంత లవ్ స్టోరీ మూవీ టీమ్ కు చెందుతుంది.

ముఖ్యంగా ఈ పాట లిరిక్స్.. తెలంగాణ జానపదంను గుర్తు చేస్తోంది. దాని కుడిభుజం మీద కడవ దాని గుత్తేపు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదురా సెలియా దానిపేరే సారంగదరియా.. అంటూ పాట జోరు యూట్యూబ్ లో 2.50కోట్ల వ్యూస్ రప్పించింది. మంగ్లీ పాడిన ఈ పాటకు హీరోయిన్ సాయిపల్లవి స్టెప్స్ అదిరిపోయాయి. ఆ విధంగానే పాటకు కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. ఈ సినిమాకు సిహెచ్ పవన్ సంగీతం అందించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అమిగోస్ క్రియేషన్స్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ కాబోతుంది.
Tags:    

Similar News