వ్యాపార వేత్తలు హీరోలగా మారడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. సంపాదనతో నిర్మాణ సంస్థల్ని స్థాపించి నిర్మాతలుగా ఎదిగే ఆలోచనే వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ బిజినెస్ మ్యాన్ వాళ్లకి భిన్నం. సంపాదన కాదు..నటనపై ఆసక్తి..ఫేం కోసం ఏకంగా ముఖానికి మ్యాకప్ వేసుకుని హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.
చెన్నైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ అరుల్ సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. కోలీవుడ్ లోనే కాదు మలయాళం.. కన్నడ.. తెలుగు.. హిందీ భాషల్లో ఆయన నటించిన చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. న్యూ శరవణన్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ పై స్థాపించి ' ది లెజెండ్' నిర్మాణంతో పాటు.. అందులో ఆయనే హీరోగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి జేడీ- జెయర్ అనే ఇద్దరు దర్శకులు పనిచేస్తున్నారు. హారిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అదించడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన వస్తుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ని జవహార్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున జరిగింది. ఈ వేడుకకు భారీ ఎత్తున సెలబ్రిటీలు పాల్గొన్నారు.
అందులోనూ అందమైన హీరోయిన్లు పూజా హెగ్డే.. తమన్నా.. శ్రద్ధా శ్రీనాథ్.. రాయ్ లక్ష్మి.. హన్సిక సహామరికొంత మంది భామలు ఈవెంట్ లో భాగమయ్యారు. దాదాపు 10 మంది స్టార్ హీరోయిన్లు హాజరైనట్లు తెలుస్తోంది. ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది..యంగ్ హీరో లో మెరుపు వేగం తొలి సినిమాలోనే కనిపిస్తుంది.
మరి భవిష్యత్ ప్లానింగ్ ఎలా ఉందన్నది తెలియాలి. లెజెండ్ లో శరవణన్ సైంటిస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. ఆయనతో పాటు ఈ చిత్రంలో నాజర్..ప్రభు.. వివేక్ ..యోగి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జులై 28న చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశం ఉంది. చెన్నై..బెంగుళూరు..ముంబైలో మీడియా మీట్ లు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.