సర్దార్ గబ్బర్ సింగ్ పాటలు మార్కెట్లో ఇరగదీసేస్తున్నాయి. టీ స్టాల్స్ నుంచి రెస్టారెంట్ల వరకు - ఐపాడ్స్ నుంచి ఎఫ్ ఎం రేడియోల వరకూ.. ఎక్కడ విన్నా పవన్ కొత్త సినిమా సాంగ్స్ కుమ్మేస్తున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటలు.. ఫ్యాన్స్ నే కాకుండా మ్యూజిక్ లవర్స్ అందరినీ అలరిస్తున్నారు.
సర్దార్...
టైటిల్ సాంగ్ గబ్బర్ సింగ్ అంటూ తో మొదలయ్యే పాట.. ట్యూన్ గబ్బర్ సింగ్ లాగానే ఉన్నా.. అంతకంటే ఎక్కువ ఓల్టేజ్ తో సాగుతుంది. ఫస్ట్ లైన్ మాత్రమే ఒరిజినల్ తీసుకుని, మిగతా అంతా మార్చేసిన ఈ పాట క్యాచీగానే కాదు.. హమ్మింగ్ కి ఈజీగా కూడా ఉంటుంది.
ఓ పిల్లా.. సుభానల్లా...
ఓ పిల్లా సుభానల్లా అంటూ సాగే రెండో పాట రొమాంటిక్ గా సాగుతుంది. సింపుల్ గా సాగే ఈ పాట పవన్ కళ్యాణ్ - కాజల్ అగర్వాల్ మధ్య ఉటుంది. శ్రేయా ఘోషల్ అద్భుతంగా పాడింది.
తోబ తోబా...
మూడో బాట తోబాతోబా అంటూ వచ్చే ఐటెమ్ సాంగ్. ఎప్పటిలాగే డీఎస్పీ ఐటెం నెంబర్ల మాదిరిగా హుషారుగా ఉంటుంది. ఆన్ స్క్రీన్ పై పనవ్ - లక్ష్మీరాయ్ వేసే చిందులు అలరిస్తాయి. అయితే.. 80ల్లో అమితాబ్ సాంగ్ నుంచి కొన్ని లైన్స్ ను మిక్స్ చేశారు.
ఆడెవడన్నా ఈడెవడన్నా...
సర్దార్ ఆల్బంలో నాలుగో పాట ఎమోషనల్ గా సాగే 'ఆడెవడన్నా ఈడెవడన్నా'. చిన్న బిట్ సాంగే అయినా.. మూవీలో కీలకంగా ఉంటుందనే విషయం లిరిక్ వింటేనే అర్ధమవుతుంది.
నీ చేపకళ్లు...
డీఎస్పీ బ్రదర్ సాగర్ - చిన్మయి పాడిన నీ చేపకళ్లు చేపకళ్లు గుచ్చుతున్నవే అనే పాట రొమాంటిక్ గా సాగుతుంది.
ఖాకీ చొక్కా...
ఆల్బంలో ఆఖరి పాట 'ఖాకీ చొక్కా వేసి నడిసొచ్చే మిస్టరూ.. లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టరూ' అంటూ ఫుల్లు మాస్ గా సాగుతుంది. మమతా శర్మ - సింహ ఫుల్ మాస్ మూడ్ తో పాడిన ఈ పాటలో పవర్ స్టార్ మాస్ అవతారాన్ని చూపించనున్నారు.
ఓవరాల్ గా చూస్తే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏమిస్తే కిక్ వస్తుందో.. వాటినే చాలా జాగ్రత్తగా సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియోలో ఇచ్చాడు దేవిశ్రీ. అన్ని రకాల పాటలు ఉన్నా.. సర్దార్ టైటిల్ సాంగ్ - నీ చేపకళ్లు - ఓ పిల్లా పాటలకు ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ ఆల్బంకి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది.