మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంతా భయపడతారు. అతడి సినిమా రావడానికి ముందు, తర్వాతి వారాల్లో తమ సినిమా రిలీజ్ చేయడానికి సందేహిస్తారు. ఒకవేళ రిలీజ్ చేసినా సరే.. పవన్ సినిమా తాకిడిని తట్టుకుని నిలబడటం చాలా కష్టం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. వేరే సినిమాల ధాటికి పవన్ మూవీ చితికిపోతోంది. ఓ మీడియం రేంజి సినిమాను.. పరభాషా చిత్రాల్ని చూసి కూడా పవన్ మూవీ భయపడే పరిస్థితి కనిపిస్తోంది. పవర్ స్టార్ కొత్త సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కలెక్షన్లు వీకెండ్ తర్వాత బాగా పడిపోయిన సంగతి తెలిసిందే. రెండు వారాల ముందు రిలీజైన ‘ఊపిరి’ కూడా ‘సర్దార్..’కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి వచ్చింది వీకెండ్ తర్వాత.
ఐతే అది చాలదన్నట్లు.. ఈ వారం ఒకటికి మూడు సినిమాలు వచ్చిపడ్డాయి. ఆ మూడూ కూడా పవన్ సినిమాను దెబ్బ కొట్టేవే. మంచు విష్ణు-రాజ్ తరుణ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఈడోరకం ఆడోరకం’ గురించి ముందు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ పాజిటివ్ టాక్ తో మొదలవడం ‘సర్దార్..’కు చేటే. మరోవైపు దిల్ రాజు విడుదల చేస్తున్న అనువాద చిత్రం ‘పోలీస్’ మీద కూడా పాజిటివ్ బజ్ నెలకొంది. ఈ సినిమాకు ఆల్రెడీ తమిళంలో హిట్ టాక్ వచ్చింది. తెలుగులో కూడా క్రేజ్ బాగానే కనిపిస్తోంది. మంచి మాస్ మసాలా సినిమా కావడంతో ఇది కూడా ‘సర్దార్’కు తలపోటు తేవడం ఖాయం. మరోవైపు షారుఖ్ ఖాన్ సినిమా ‘ఫ్యాన్’ కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తునే రిలీజవుతోంది. కాబట్టి మూడు కొత్త సినిమాలు కలిపి ‘సర్దార్’కు గట్టి పంచ్ లే ఇచ్చేలా కనిపిస్తున్నాయి.