ఈ పాటేదో తేడాగా ఉంది పవన్..

Update: 2016-03-22 12:30 GMT
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ఆడియోల్లో ఒకటనదగ్గ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆల్బమ్ రిలీజైపోయిపోయింది. పవన్ కళ్యాణ్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లు ఈ ఆల్బమ్ లేదన్న అభిప్రాయం వినిపించినప్పటికీ.. అంచనాల్ని పక్కనబెట్టి చూస్తే మాత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో బాగానే అలరిస్తోంది. ఒక్క ఐటెం సాంగ్ విషయంలోనే అభిమానుల నుంచి ఎక్కువగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. మిగతా పాటలన్నింటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ఆడియోలో ప్రత్యేకంగా వినిపించే పాట ఒకటుంది. అదే.. తోబా తోబా అనే పల్లవితో అనంత్ శ్రీరామ్ రాసిన పాట.

‘గబ్బర్ సింగ్’ సినిమాలో మందుబాబులం మేము మందుబాబులం అంటూ తాగుబోతుల మనోభావాన్ని తెలిపే పాట ఒకటుంది గుర్తుంది కదా. అదే టైపులో వ్యసనాల మీద రాసిన పాట ఇది. మనం తాగితే తప్పంటారని.. కానీ పైన ఇంద్రుడు అండ్ కో తాగితే మాత్రం గొప్పగా చెబుతారని.. ఇది ఏం న్యాయమని అంటూ ఓ చరణం సాగితే.. మనం పేకాట ఆడితే తప్పని.. కానీ ధర్మరాజు ఆడితే తప్పు కాదా అంటూ ఇంకో చరణం సాగుతుంది ఈ పాటలో ఇక పల్లవిలో వీధిలో వేసే రికార్డింగ్ డ్యాన్సులకు.. పైన రంభ ఊర్వశి వేసే డ్యాన్సులకు పోలిక పెట్టారు. మొత్తానికి ఈ పాట కొంచెం తేడాగానే ఉంది. సినిమాలో ఏ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది.. ఈ పాటను పవన్ కళ్యాణ్ పాడతాడా.. ‘గబ్బర్ సింగ్’లో కోట శ్రీనివాసరావు లీడ్ తీసుకున్నట్లు ఇంకేదైనా ముఖ్యమైన పాత్రతో ఈ పాట పాడిస్తారా అన్నది ఆసక్తికరం. ఎందుకంటే రాజకీయ నేతగా కూడా ఉన్నపవన్ తో ఇలాంటి పాటలు పాడిస్తే కష్టం కదా.
Tags:    

Similar News