మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న గ్రామం రతన్ పూర్. ఆ ఊరికి బైరవ్ సింగ్ అనేవాడే శాశనుడు. వాడే శాపం. వాడే విలన్. ఇక అదే ఊరిలో ఒక రాజకుమారి. ఒక సంస్థానానికి వారసురాలు కాజల్ అగర్వాల్. వీడి నుండి ఆమెను కాపాడటానికి.. ఎస్సై నుండి సిఐ గా ప్రమోషన్ ఇచ్చి మరీ ''గబ్బర్ సింగ్''ను ఇక్కడ పంపిస్తారు. అప్పుడు ఆ ఒక్కడు ఏం చేశాడనేదే సినిమా. అదే ''సర్దార్ గబ్బర్ సింగ్''.
దాదాపు సినిమా స్టోరీ అంతా కూడా ఒక్క ట్రైలర్ తోనే చెప్పేస్తే ఎలా ఉంటుంది? అదే హాలీవుడ్ స్టయిల్. మరి 'స్టోరీ అండ్ స్ర్కీన్ ప్లే' అందించిన పవన్ కళ్యాన్ స్టయిల్ కూడా అదే. అందుకే చాలా ఫాస్టు పేస్ తో పవర్ ఫుల్ గా ఉన్న ఈ ట్రైలర్ లో కథ అంతా ఉంది. అయితే ముందు చాలా కామెడీగా ఉండే గబ్బర్ సింగ్.. తరువాత సీరియస్ గా భైరవ్ సింగ్‌ను ఏం చేస్తాడు అనేదే సినిమా. పవన్ ఎనర్జీ.. స్టయిల్.. డైలాగులు మెయిన్ ఎసెట్. దర్శకుడు బాబీ టేకింగ్ అదిరిపోయింది. 'ది పవర్ ఆఫ్ వన్' అంటూ మనోడు తన పవర్ ను చూపించేశాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ''ఓయ్ పేరు గుర్తుందిగా.. సర్దార్ గబ్బర్ సింగ్'' అంటూ పవన్ ఆఖర్లో ఇచ్చిన పంచ్ ఉలిక్కిపడేలా చేసిందంతే.
సర్దార్ పలికిన ఓ రెండు డైలాగులను ఓసారి లుక్కేసుకోండి..
--పొగరెక్కి తలెగరేసే నీలాంటోడు పుట్టిన ప్రతీసారీ తెగనరకడానికి నాలాంటోడు పుడుతూనే ఉంటాడు
--ఒక్కడ్నే.. ఒక్కడ్నే.. ఎక్కడికైనా ఇలాగే వస్తా.. ఇలాగే ఉంటా.. జనంలో ఉంటా జనంలా ఉంటా
Full View