రెండు న‌గ‌రాల్లో ప‌వ‌ర్ హోరు

Update: 2016-03-20 13:30 GMT
త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలోనూ - తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌ లోనూ...  ప‌వ‌ర్ స్టార్ - ప‌వ‌ర్ స్టార్ అన్న నినాదాలు హోరెత్తిపోతున్నాయి. హైద‌రాబాద్‌ లో అయితే మ‌న ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్  న‌టించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ పాట‌ల వేడుక ఉంది, మ‌రి చెన్నైలో ప‌వ‌ర్ స్టార్ నినాదాలు ఎందుకు అనుకుంటున్నారా? అక్క‌డ కూడా పాట‌ల విడుద‌ల వేడుక జ‌రుగుతోందండోయ్‌! అయితే అక్క‌డ మ‌న ప‌వ‌ర్‌ స్టార్ పాట‌లు కాదు, త‌మిళ ప‌వ‌ర్‌ స్టార్ పాట‌లు విడుద‌ల‌వుతున్నాయి.

అవును... త‌మిళ‌నాట విజ‌య్‌ నీ, తెలుగులో ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ ల‌నీ ప‌వ‌ర్‌ స్టార్ అని పిలుస్తుంటారు అభిమానులు. వీళ్లిద్ద‌రి వ్య‌క్తిత్వాల‌కి కూడా చాలా సారూప్య‌తలు ఉన్నాయి. ఇద్ద‌రూ నిరాండ‌బ‌రంగానే ఉంటారు, త‌క్కువ‌గానే మాట్లాడుతుంటారు, కానీ క్రేజ్ విష‌యంలో మాత్రం ఆకాశ‌మే హ‌ద్దు. త‌మిళంలో విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తేరి సినిమాలోని పాట‌లు ఈరోజే విడుద‌ల‌వుతున్నాయి. ప్ర‌స్తుతం అక్క‌డ వేడుక జ‌రుగుతోంది. సేమ్ టు సైమ్ హైద‌రాబాద్‌ లోని నోవాటెల్ ద‌గ్గ‌ర ఉన్న హ‌డావుడే చెన్నై న‌గరంలోనూ ఉంది. అభిమానులు ప‌వ‌ర్‌ స్టార్ విజ‌య్‌ ని  చూసేందుకు, ఆడియో వేడుక‌లో పాల్గొనేందుకు వేదిక ద‌గ్గ‌ర కిక్కిరిసిపోతున్నారు. అలాగే హైద‌రాబాద్‌ లోనూ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ వేడుక మ‌రికాసేప‌ట్లోనే మొద‌లుకాబోతోంది.  ప‌వ‌న్ మేనియాతో హైటెక్స్ ప్రాంగ‌ణ‌మంతా మార్మోగిపోతోంది. ఆడియో వేడుక ద‌గ్గ‌రికి వెళ్ల‌నున్న ప‌వ‌న్‌ ని చూసేందుకు అభిమానులు హైటెక్స్‌ లో జ‌నాలు పోటీప‌డుతున్నారు. విజ‌య్‌ - ప‌వ‌న్ సినిమాల పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మాలు రెండూ ఒకే రోజు జ‌రుగుతుండ‌డం విశేష‌మే మరి!
Tags:    

Similar News