పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ ను మార్చ్ 12న పెద్ద ఎత్తున వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకమైన ఈవెంట్ ను గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా భారీ ఈవెంట్స్ కు దూరంగా ఉండే పవన్ కూడా.. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో ప్లాన్డ్ గా ఉంటున్నాడు.
సర్దార్ ఆడియో వేడుకకు మెగా బ్రదర్స్ అందరూ వస్తారని, పెద్ద ఎత్తున జరగబోతోందన్నది తెలిసిన విషయమే అయినా.. ఈ వేడుకను హైద్రాబాద్ లో కాకుండా అమరావతి లో నిర్వహించాలన్న ఆలోచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం పవన్ ఫంక్షన్ కోసం సరైన ప్లేస్ ను వెతుకుతున్నారు నిర్మాతలు. ఇందుకోసం పవన్ సన్నిహితులు ఇప్పటికే అమరావతి పరిసరాల్లో సర్వే నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. దాదాపు లక్షమంది ఆహుతులకు సరిపోయేలా ఏర్పాట్లు ఉండాలని భావిస్తున్నారు. ఓ సినిమా ఫంక్షన్ మాదిరిగా కాకుండా.. ఓ పబ్లిక్ ఈవెంట్ రేంజ్ లో జరపాలన్నది పవన్ యోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ తుది దశకు చేరుకుంది.
హైద్రాబాద్ లో టైటిల్ సాంగ్ ని, యూరోప్ లో రెండుపాటలను షూట్ చేసేస్తే మొత్తం వర్క్ కంప్లీట్ అవుతుంది. అలాగే ఏప్రిల్ 9న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించగా.. అసలు అమరావతిలోనే ఆడియో వేడుక ఎందుకు జరుపుతున్నాడో.. ఆ డీటైల్స్ ని పవన్ స్వయంగా ఫంక్షన్ లోనే చెబుతాడట.