ఎవరూ ఊహించని, ఊహించలేని షాక్ లు ఇవ్వడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బాగా అలవాటు. ప్రాజెక్టుల సెలక్షన్ నుంచి, టెక్నీషియన్ల వరకూ ఏదో ఒక షాక్ ఇస్తూనే ఉంటాడు. ఇక్కడి మీడియా జనాలకే ఏనాడూ ఇంటర్వ్యూ ఇవ్వని పవన్.. ఒక్కసారిగా బాలీవుడ్ మీడియాతో ముచ్చట్లు పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇలా ఎందుకు జరిగిందనే సంగతి.. సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ పోస్టర్ చూశాక కానీ అర్ధం కాలేదు.
ఇప్పుడు ఆడియో ఫంక్షన్ విషయంలో కూడా ఇలాంటి ఓ ఛేంజ్ కనిపిస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల కార్యక్రమం కోసం గచ్చిబౌలి స్టేడియం - నిజాం కాలేజ్ గ్రౌండ్స్ ను వేదికలుగా ఎంపిక చేశారు. ఈ మేరకు పోలీసుల నుంచి పర్మిషన్స్ కూడా అడుగుతూ లేఖలు పంపారు. ఇప్పుడు మాత్రం., సర్దార్ ఆడియో వేదికను నోవోటెల్ హోటల్ మార్చేశారు. ఈ నెల 20తేదీన సాయంత్రం 7గంటలకు ఈ ఫంక్షన్ జరగనుంది. ఫంక్షన్ డేట్ కి సరిగా ఓ వారం కూడా సమయం లేనపుడు.. ఇలా వెన్యూ ఛేంజ్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
మొత్తానికి ఈ ఫంక్షన్ విషయంలోనూ తన మార్క్ చూపిస్తున్న పవన్.. ఆ రోజున వేదికపై కేవలం సర్దార్ గబ్బర్ సింగ్ కు పనిచేసిన యూనిట్ మాత్రమే ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కాజల్ తొలిసారిగా ఈ సినిమాలో పవన్ కు జంటగా నటించగా... ఏప్రిల్ 8న తెలుగు - హిందీ భాషల్లో భారీ రిలీజ్ కు నిర్మాణ సంస్థ ఈరోస్ ప్లాన్ చేసింది.