సర్దార్ లెక్క సెంచరీ దాటేసిందోచ్

Update: 2016-03-15 17:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కి మరో మూడు వారాలు మాత్రమే టైం ఉంది. ఇంకా ఐదు రోజుల్లో పవర్ స్టార్ సినిమా ఆడియో ఫంక్షన్ కూడా జరగనుంది. ఒకవైపు మేకింగ్ వీడియో, మరోవైపు మేకింగ్ సమయంలో తీసిన ఫోటోలతో.. టాలీవుడ్ అంతా పవర్ స్టార్ జపం చేసేసే పరిస్థితి. ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ కి అన్ని ఏరియాల బిజినెస్ పూర్తయిపోయింది. ప్రీ రిలీజ్ లో పవన్ మూవీ చేసిన బిజినెస్ బ్రేకప్ డీటైల్స్ ఇవే.

సర్దార్ గబ్బర్ సింగ్ కి నైజాంలో వచ్చిన మొత్తం 21 కోట్లు. సీడెడ్ 10.44 కోట్లు, నెల్లూరు 2.70 కోట్లు, కృష్ణా 4.05 కోట్లు, గుంటూరు 5.40 కోట్లు, వైజాగ్ 7.20 కోట్లు, తూర్పు గోదావరి 5.40 కోట్లు, పశ్చిమ గోదావరి 4.05 కోట్లు, కర్నాటక మరియు రెస్టాఫ్ ఇండియా 9 కోట్లు బిజినెస్ చేయగా.. ఓవర్సీర్ రైట్స్ రూపంలో 11  కోట్లు వచ్చాయి. మొత్తం సర్దార్ గబ్బర్ సింగ్ ప్రి రిలీజ్ బిజినెస్ లెక్క 80.24 కోట్లు.

ప్రీ రిలీజ్  బిజినెస్ లో ఇది టాలీవుడ్ సెకండ్ బిగ్గెస్ట్ ఫిగర్. వీటికి నాన్ థియేట్రికల్ (ఆడియో, ఆడియో ఫంక్షన్ టెలికాస్ట్, శాటిలైట్) హక్కులను కూడా కలిపితే మొత్తం లెక్క 105 కోట్లుగా తేలింది సర్దార్ లెక్క. విడుదలకు ముందే బిజినెస్ ని వంద కోట్లు దాటించి.. బాక్సాఫీస్ దగ్గర తన పవర్ ఏంటో చెప్పేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ఏప్రిల్ 8నుంచి థియేటర్ల దగ్గర హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News