ఇంకా విడుదల తేదీకి పది రోజుల దాకా సమయం ఉంది.. రిలీజ్ డేట్ పోస్టర్లు అడ్వర్టైజ్మెంట్లు.. పోస్టర్లు కూడా రెడీ కాలేదింకా. సినిమాకు సెన్సార్ కూడా పూర్తి కాలేదు. అయినప్పటికీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. కాకపోతే ఇది తెలుగు రాష్ట్రాల్లో ఏమో అని మాత్రం ఆత్రపడిపోకండి. ఇదంతా జరుగుతోంది ఆస్ట్రేలియాలో.
ఆస్ట్రేలియాలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థ.. ఆల్రెడీ థియేటర్లు బుక్ చేసేసి.. టికెట్లు కూడా సేల్ కు పెట్టేసింది. ఆలసించిన ఆశాభంగం అన్నట్లు జనాలు కూడా పోటీ పడి టికెట్లు కొనేస్తున్నారు. సిడ్నీలో ఓ థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేయగా.. ఒక్క రోజులోనే 80 శాతం టికెట్లు అయిపోయాయి. సిడ్నీతో పాటు పెర్త్ లాంటి నగరాల్లోనూ బుకింగ్స్ ఓపెన్ చేయడం.. చాలా వరకు టికెట్లు అమ్ముడైపోవడం విశేషం.
ఇంకా జనాలకు ‘సర్దార్..’ రిలీజ్ ఊపు రాలేదు కానీ.. లేకుంటే ఈ 20 శాతం కూడా మిగులుతాయా చెప్పండి. పవన్ కళ్యాణ్ సినిమా అంటే క్రేజ్ ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా విడుదలవుతుండటంతో అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. రిలీజ్ కు ముందు ఈ ఉత్సాహం వెర్రిగా మారే అవకాశముంది. ‘సర్దార్..’ టికెట్ ధరలు కొత్త రికార్డుల్ని నమోదు చేయడం గ్యారెంటీనే.