ఈ ఏడాదంతా పెద్ద సినిమాల వాయిదా వార్తలే వినిపిస్తున్నాయి. టెంపర్ దగ్గర్నుంచి తాజాగా అఖిల్ వరకు పెద్ద సినిమాలు చాలానే వాయిదా పడ్డాయి. ఇక వచ్చే ఏడాది కూడా ఇదే ఒరవడి కొనసాగించేలా సంక్రాంతి సినిమాలకు సంబంధించి వాయిదా వార్తలు వినిపించాయి. సంక్రాంతి రేసు నుంచి డిక్టేటర్, అ..ఆ, సర్దార్ గబ్బర్ సింగ్ తప్పుకున్నుట్లు వార్తలొచ్చాయి. వీటిలో ముందు వాయిదా పడ్డట్లు న్యూస్ వచ్చి సర్దార్ గురించే.
ఐతే ఇప్పుడో సర్‌ప్రైజ్ ఏంటంటే.. సర్దార్ గబ్బర్ సింగ్ సంక్రాంతికే వస్తుందట. ఈ మాట స్వయంగా పవన్ కళ్యాణే అంటున్నాడు. ఆదివారం సాయంత్రం తన అన్నయ్య చిరంజీవిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ ఈ సంగతి వెల్లడించాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నట్టు పవన్ తెలిపాడు. రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమా చూసిన అనంతరం తాను సర్దార్ షూటింగ్ కోసం గుజరాత్ బయల్దేరుతున్నట్లు పవన్ వెల్లడించాడు.
చిరంజీవి పునరాగమనం గురించి మాట్లాడుతూ.. అన్నయ్య మళ్లీ సినిమాల్లోకి రావడం ఆనందం కలిగించిందని పవన్ చెప్పాడు. చిరంజీవితో మళ్లీ కలిసి నటించే అవకాశముందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇంతకుముందుశంకర్ దాదా సినిమాలో అన్నయ్యతో కలిసి యాదృచ్ఛికంగానే నటించానన్నాడు. రామ్ చరణ్ హీరోగా తాను నిర్మించబోయే సినిమా కోసం రెండు, మూడు కథలను పరిశీలించామని పవన్ చెప్పడం విశేషం.