సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి శాటిలైట్ - డిజిటల్ రైట్స్ భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు తన కెరీర్ 26వ సినిమాలో నటిస్తున్నారు. మహేష్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు ఇటీవలే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. జూలై లో రెగ్యులర్ చిత్రీకరణకు టీమ్ రెడీ అవుతోంది. షెడ్యూల్ ప్రారంభం అయ్యాక బ్రేక్ అన్నది లేకుండా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందిట టీమ్.
ఇంకా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కాకముందే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే శాటిలైట్ హక్కుల్ని సేల్ చేసేశారని తెలుస్తోంది. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ జెమినీ 16.5 కోట్లకు డిజిటల్ రైట్స్ ని దక్కించుకుందని తెలుస్తోంది. మహర్షి రైట్స్ 12కోట్లు పలికింది. దాంతో పోలిస్తే మరో 4.5కోట్లు ఎక్కువే పలికిందట. ఇక డిజిటల్ రైట్స్ .. ఆడియో హిందీ డబ్బింగ్ వగైరా ఇంకా అమ్మకాలు సాగలేదు.
మహర్షి లాంటి బిగ్ సక్సెస్ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా ఇది. ఎఫ్ 2తో బ్లాక్ బస్టర్ కొట్టి అనీల్ రావిపూడి జోరుమీదున్నాడు. ఈ జోడీతో అనీల్ సుంకరతో పాటు సక్సెస్ ల రాజుగారు జాయిన్ అవ్వడంతో హైప్ పెరిగింది. కేవలం శాటిలైట్ రైట్స్ మాత్రమే కాదు.. ఇతరత్రా బిజినెస్ లోనూ సరిలేరు నీకెవ్వరూ స్పీడ్ చూపిస్తుందనడంలో సందేహమేం లేదు. ఈ సినిమాపై భారీ బెట్టింగ్ కి ఆస్కారం ఉందని ఇప్పటికే ట్రేడ్ లోనూ చర్చ సాగుతోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మాట అటుంచితే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో దాదాపు 50 కోట్లు పైగానే గిట్టుబాటు అయ్యే వీలుందని తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ వరకూ నిర్మాతలకు హక్కులు ఉంటే.. నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో వచ్చేదంతా మహేష్ కి చెందుతుందట. అంటే మహేష్ పారితోషికం తీసుకోకుండా రకరకాల మార్గాల్లో సుమారు 50 కోట్ల వరకూ అందుకుంటారని అంచనా వేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. లేడీ అమితాబ్ విజయశాంతి చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.