ప్రస్తుతం ఒక సినిమాను మార్కెటింగ్ చేసి జనాలకు రీచ్ చేయడమనేది పెద్ద టాస్క్. ఆ టాస్క్ రీచ్ అయితే చాలు ఏ సినిమాకైనా ఓపెనింగ్స్ పుష్కలంగా ఉంటాయి. నిజానికి పబ్లిసిటీ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో స్ట్రాటజీ ఫాలో అవుతారు. ఇక సంక్రాంతి బరిలో నిలిచిన బన్నీ అల 'వైకుంఠపురములో' ప్రమోషన్స్ విషయంలో జోరుగా దూసుకెళ్తుంది.
టీజర్, వరుసగా రిలీజ్ చేసిన పాటలు సినిమాపై ఓ రేంజ్ లో బజ్ తీసుకొచ్చాయి. అయితే ఈ విషయంలో మహేష్ సరిలేరు నీకెవ్వరు నత్త నడకన సాగుతుంది. అసలు ఇంత వరకూ ఒక్క పాట కూడా రిలీజ్ అవ్వలేదు. ఒక వైపు బన్నీ మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంటే మహేష్ ఇంకా సైలెంట్ గానే ఉంటున్నాడు
ఇక ప్రమోషన్స్ విషయంలో ఇప్పటికే రెండు మూడు మీటింగ్స్ పెట్టుకున్న మేకర్స్ ఇలాగైతే కష్టమని భావించి రొటీన్ కి భిన్నంగా కొత్తగా ఏదైనా చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే లేటెస్ట్ గా సినిమా పీ. ఆర్.టీమ్ ప్లాన్స్ పక్కన పెట్టి మరీ కొత్త వారికోసం చూస్తున్నారు. ప్రమోషన్ ప్లాన్స్ లో ఆదరగొట్టేవారు మీ ఇన్నోవేటీవ్ ఐడియాస్ తో తమని సంప్రదించగలరు అంటూ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ఈ దెబ్బతో సరిలేరు టీమ్ ప్రమోషన్స్ లో వీక్ అని వెల్లడైంది. మరి కొత్త వాళ్ళ ఐడియస్ సినిమా ప్రమోషన్స్ కి ఎంత వరకూ హెల్ప్ అవుతాయో చూడాలి.