సూపర్ స్టార్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కామెడీ - యాక్షన్ ఎంటర్టైనర్ 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా రెండు అప్డేట్స్ బయటకు వచ్చాయి.
అందులో మొదటిది టీజర్ రిలీజ్ విషయం. 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ ను దీపావళికి రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశించారు కానీ రిలీజ్ కాకపోవడంతో కాస్త నిరాశచెందారు. అయితే 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ ను నవంబర్ మూడవ వారంలో రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారని సమాచారం. ఈ టీజర్లో యాక్షన్ సీక్వెన్సులతో పాటుగా అనిల్ స్టైల్ కామెడీ పంచులు కూడా ఉంటాయని.. ప్రేక్షకులకు ఒక ట్రీట్ లా ఉంటుందని అంటున్నారు. మరో రెండు రోజుల్లో ఎగ్జాక్ట్ టీజర్ రిలీజ్ డేట్ వెల్లడవుతుందట.
రెండో విషయం ఏంటంటే బెటర్ మెంట్ కోసం సినిమాలో అప్పటికప్పుడు కొన్ని సీన్స్ జోడించాలని నిర్ణయించారట. లాస్ట్ మినిట్ లో ఇలా కొత్త సీన్స్ జోడించడం వల్ల కొంత బడ్జెట్ కూడా పెరిగిందని అంటున్నారు. ఈ సన్నివేశాల కోసమే కేరళ ఎపిసోడ్ ను ప్లాన్ చేసినట్టు సమాచారం. అనిల్ రావిపూడి పక్కా స్క్రిప్ట్ తోనే ముందుకెళ్ళే దర్శకుడు. అయితే లాస్ట్ మినిట్ లో మార్పులు చేశారంటే అవి తప్పని సరిగా ప్రేక్షకులను మెప్పించేవిగా ఉండడం ఖాయం