సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ ముందుగా ప్రకటించిన సమయానికే విడుదలయింది.
"మీరెవరో మాకు తెలీదు. మీకు మాకు ఏ రక్త సంబంధమూ లేదు. కానీ మీకోసం మీ పిల్లల కోసం పగలు రాత్రీ ఎండా వానా లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే.. మీరు మా బాధ్యత" అంటూ మహేష్ ఎమోషనల్ వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభం అయింది. ఈ సమయంలో మిలిటరీ యూనిఫాం లో మహేష్ విజువల్స్ కేక పుట్టించేలా ఉన్నాయి. ఇక 'మీరు మా బాధ్యత' అనే సమయంలో మంటల్లో నుంచి మహేష్ నడుస్తూ వచ్చే సీన్.. దేవీ నేపథ్య సంగీతం గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. సీన్ కట్ చేస్తే.. రాయలసీమ. అక్కడ రౌడీలను తుక్కు రేగ్గొట్టి "మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలు రా.. మిమ్మల్నెలా చంపుకుంటాను" అంటూ ఊహకందని వెరైటీ లాజిక్ తో క్లాస్ పీకుతూ ఉంటాడు.
ఎక్కువ సోది లేకుండా స్ట్రెయిట్ గా ఒక్క ముక్కలో చెప్తే టీజర్ అదిరిపోయింది. బుల్లెట్ దిగింది. అంతే. అనిల్ రావిపూడి చాలా రోజులనుండి మహేష్ ను ఫుల్ మాస్ గా చూడబోతున్నారు అని చెప్పినట్టే మాట నిలబెట్టుకున్నాడు. కొండారెడ్డి బురుజు సెంటర్లో "భయపడేవాడే బేరానికొస్తాడు. మనదగ్గర బేరాల్లేవమ్మా" అంటూ ఊర మాస్ డైలాగ్ విజిల్స్ వేయించేలా ఉంది. విజయశాంతి.. ప్రకాష్ రాజ్ లను రెండు సీన్లో చూపించారు. వారిద్దరి సీన్లు.. స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్లస్ గా ఉంది. ఈ టీజర్ లో మిస్ అయింది హీరోయిన్ రష్మిక మాత్రమే.
దేవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. రత్నవేలు సినిమాటోగ్రఫీ.. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ అద్భుతః. మహేష్ ను చాలా రోజుల తర్వాత పర్ఫెక్ట్ మాస్ హీరోలా చూస్తున్నట్టు అనిపిస్తోంది. సినిమాపై ఒక్కసారిగా అంచనాలను ఆకాశంలోకి తీసుకెళ్లింది ఈ టీజర్.. ఆలస్యం ఎందుకు.. టీజర్ చూడడం మీ బాధ్యత!
Full View