చిత్రం : 'సర్కార్'
నటీనటులు: విజయ్ - కీర్తి సురేష్ - వరలక్ష్మి శరత్ కుమార్ - రాధారవి - పాల కరుపయ్య - యోగి బాబు తదితరులు
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
ఛాయాగ్రహణం: గిరీష్ గంగాధరన్
నిర్మాత: వల్లభనేని అశోక్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్
తమిళంలో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరోగా విజయ్. అనేక ప్రయత్నాల మధ్య ఈ మధ్య తెలుగులోనూ అతను కొంచెం క్రేజ్ సంపాదించుకున్నాడు. తెలుగువారికి బాగానే పరిచయం ఉన్న మురుగదాస్ దర్శకత్వంలో అతను నటించిన చిత్రం ‘సర్కార్’. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలు ‘తుపాకి’.. ‘కత్తి’ భారీ విజయాలు సాధించిన నేపథ్యంలో ‘సర్కార్’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీపావళి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.
కథ:
సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచంలోనే నంబర్ వన్ కార్పొరేట్ కంపెనీకి సీఈవో. అతను తన సొంత రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి అమెరికా నుంచి వస్తాడు. కానీ ఇక్కడ అతడి ఓటును ఇంకెవరో వేసేశారని తెలుస్తుంది. దీంతో అతను న్యాయ పోరాటానికి దిగుతాడు. సుందర్ ఓటు మళ్లీ ఓటు వేసే వరకు అతడి నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా తీర్పు ఇస్తుంది కోర్టు. తర్వాత మరింత మంది తమ ఓటు విషయంలో ఇలాగే న్యాయ పోరాటానికి దిగడంతో మొత్తం ఎన్నికలే రద్దవుతాయి. దీంతో అధికార పార్టీకి కోపం వస్తుంది. ఆ పార్టీ నేతలు సుందర్ ను కవ్వించడంతో అతను ఏకంగా ముఖ్యమంత్రి మీదే పోటీకి దిగుతాడు. తర్వాత అన్ని నియోజకవర్గాల్లోనూ తన అభ్యర్థుల్ని నిలబెడతాడు. మరి సుందర్ ఈ పోరులో గెలిచాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
తమిళం నుంచి వచ్చే అన్ని కథలూ సార్వజనీనంగా ఉండవు. కొన్నింటికి నేటివిటీ అనేది పెద్ద సమస్యగా మారుతుంటుంది. ముఖ్యంగా రాజకీయాల నేపథ్యంలో సినిమాలంటే అక్కడి పరిస్థితుల చుట్టూనే తిరుగుతాయి. ఇక్కడ కనెక్టివిటీ అనేది పెద్ద సమస్యగా మారుతుంది. అందులోనూ హీరోకు రాజకీయ లక్ష్యాలు ఉండి.. తన ఉద్దేశాల్ని జనాలకు చేరవేయాలని అనుకుంటే.. సినిమా ద్వారా తన పొలిటికల్ ఇమేజ్ పెంచుకోవాలని చూస్తే ‘నేటివిటీ’ ఫ్యాక్టర్ మరింత పెద్ద సమస్యగా మారుతుంది. తెలుగులో కూడా తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ లాంటి హీరో అయినా ఓకే అనుకోవచ్చు కానీ.. ఇప్పుడిప్పుడే ఇక్కడ కొంచెం ఆదరణ సంపాదించుకుంటున్న విజయ్ లాంటి హీరోను ఇలా చూడటం మరింత ఇబ్బందే. ‘సర్కార్’ తో వచ్చిన ప్రధాన సమస్య ఇదే.
ఎప్పుడూ కథ చాలా బలంగా ఉండేలా చూసుకునే మురుగదాస్ సైతం ‘స్సైడర్’ తర్వాత ఆత్మవిశ్వాసం కోల్పోయాడో ఏమో.. ఈసారి ఆ విషయాన్ని పక్కన పెట్టి.. విజయ్ ఇమేజ్ ను వాడుకోవడానికి.. అతడి అభిమానుల్ని మెప్పించడానికి.. అతడికి పొలిటికల్ మైలేజీ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ‘సర్కార్’ ఒక సాధారణ సినిమా మిగిలిపోయింది. విజయ్-మురుగదాస్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘తుపాకి’.. ‘కత్తి’ సినిమాలకు ‘సర్కార్’ దరిదాపుల్లో కూడా నిలవదు. తమిళనాడు రాజకీయ పరిస్థితులకు దగ్గరా ఉండటం వల్ల.. విజయ్ అభిమానుల్ని మెప్పించే అంశాలుండటం వల్ల అక్కడి జనాలకు ‘సర్కార్’ బాగానే అనిపించొచ్చేమో కానీ.. మన వాళ్లకు మాత్రం ఇది చేదు గుళికే.
సాధారణంగా తన కథల్లోకి హీరోల్ని ఇమిడిపోయేలా చేసే మురుగదాస్.. ‘స్పైడర్’తో ఎదురు దెబ్బ తిన్నాక ఆత్మరక్షణలో పడిపోయి ‘సర్కార్’ కథ రాశాడేమో అనిపిస్తుంది. అప్పటిదాకా అమెరికాలో ఉన్న హీరో.. తన ప్రాంతానికి రావడం.. అక్కడ తన చర్యలతో జనాల దృష్టిని ఆకర్షించడం.. తలపండిన రాజకీయ నాయకుడిని ఢీకొట్టడం.. కొన్ని రోజుల్లోనే రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగడం.. తన వ్యూహాలతో జనాలకు చేరువ కావడం.. ఎన్నికల్లో గెలిచేయడం.. ఇలా మరీ సినిమాటిగ్గా సాగిపోతుంది ‘సర్కార్’. ‘ఒకే ఒక్కడు’ తరహాలో కొంచెం వాస్తవికంగా కథను నడిపించే ప్రయత్నమేదీ చేయలేదు మురుగదాస్. లార్జర్ దన్ లైఫ్ హీరో క్యారెక్టర్లు మురుగదాస్ సినిమాల్లో కొత్తేమీ కాదు కానీ.. ఇంతకుముందు అవి చాలావరకు కన్విన్సింగ్ గా అనిపించేవి. బలమైన ఎమోషన్లు.. హృద్యమైన సన్నివేశాలు.. పరుగులు పెట్టే కథనంతో ప్రేక్షకుల్ని మాయలో పడేసేవాడు. కానీ ‘సర్కార్’లో అవి మిస్సయ్యాయి. ముఖ్యంగా ఇందులో ఎక్కడా లాజిక్ అన్నదే కనిపించకపోవడం పెద్ద సమస్య.
హీరో ఏడాదికి రూ.1800 కోట్ల జీతం తీసుకునే కార్పొరేట్ సీఈవోనట. అతను ఏ దేశంలో అడుగు పెట్టినా అక్కడి కార్పొరేట్ కంపెనీల్ని కొనేస్తాడట. తర్వాత వాటిని మూత వేయిస్తాడట. అతను ఇండియాకు వస్తున్నాడనగానే కార్పొరేట్ కంపెనీల్లో అందరూ పనులు మానేసి గుండెలు అరచేతుల్లో పట్టుకుని నిలబడతారు. అసలు అతను కంపెనీల్ని ఎందుకు కొని.. మూత వేయిస్తాడు అన్నదానికి కారణం చెప్పలేదు. ఇదలా వదిలేస్తే.. వేల కోట్ల అధిపతి అయిన హీరో రాజకీయాల్లోకి అడుగు పెట్టాక ఏమీ లేని వాడిలా కనిపిస్తాడు. జనాలు తాము ఉంటున్న ఇళ్లను ఖాళీ చేసి అతడికి ఆఫీస్ చేసి ఇస్తారు. ఇందులో లాజిక్ ఏంటో అర్థం కాదు. ఇక అన్నేళ్ల పాటు ఏమయ్యాడో తెలియని హీరో.. తన ఓటు ఇంకెవరో వేశారని ఉన్నట్లుండి పోరాటం మొదలు పెడతాడు. చాలా ఈజీగా ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాడు. కొన్ని రోజుల్లోనే పార్టీ పెట్టి ఏదో ఒక చిన్న ఏరియాలో చిన్న మీటింగ్ పెట్టి స్పీచ్ ఇచ్చేసి వేలు.. లక్షల మంది మద్దతు సంపాదిస్తాడు. హీరో కాబట్టి ఏమైనా చేసేస్తాడు అన్నట్లుగా వ్యవహారం సాగిపోతుంటుందే తప్ప ఏదీ లాజికల్ గా.. కన్విన్సింగ్ గా అనిపించదు ‘సర్కార్’లో.
ఏమీ లేని చోట హీరోకు విపరీతమైన బిల్డప్.. ఎలివేషన్.. విజయ్ తమిళనాట పెద్ద హీరో కాబట్టి అక్కడి వాళ్లకు ఇవన్నీ ఓకే అనిపించొచ్చు కానీ.. మన వాళ్లకు మాత్రం చికాకు పెడతాయి. తన ఓటు ఇంకెవరో వేశారని హీరో పోరాడటం అనే పాయింట్ ఆసక్తికరమైందే. ఎక్కువమందికి కనెక్టయ్యేదే. హీరో తెచ్చిన చైతన్యంతో మిగతా వాళ్లు కూడా పోరాటంలోకి దిగడం వరకు ‘సర్కార్’ కొంత కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. ఆ తర్వాత మాత్రం అంతా ఇల్లాజికల్ గా సాగిపోతుంది. ముఖ్యంగా విజయ్ పొలిటికల్ ఇమేజ్ పెంచడానికే ఉద్దేశించిన ద్వితీయార్ధం మన వాళ్లకు కనెక్టవడం చాలా కష్టం. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ నుంచి ఏదో ఆశించే ప్రేక్షకులకు మరోసారి నిరాశ తప్పదు. ఎప్పట్లాగే మురుగదాస్ హీరోయిన్ క్యారెక్టర్ని నామమాత్రం చేశాడు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ తీర్చిదిద్దిన యాక్షన్ ఎపిసోడ్లు.. రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా ఎంగేజ్ చేస్తాయి కానీ.. అవేమీ సినిమాను నిలబెట్టలేకపోయాయి. తెలుగులోనూ విజయ్ కి వీరాభిమానులంటే వాళ్లను మాత్రమే ‘సర్కార్’ అలరిస్తుంది తప్ప.. మురుగ-విజయ్ కాంబినేషన్లో వచ్చిన ‘తుపాకి’.. ‘కత్తి’ లాంటి సినిమాల్ని చూసిన కళ్లతో దీన్ని చూస్తే తీవ్ర నిరాశ తప్పదు.
నటీనటులు:
ఒక స్టార్ హీరో నుంచి అభిమానులు ఆశించే పెర్ఫామెన్స్ ఇచ్చాడు విజయ్. అతడి స్టైల్.. స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటాయి. కథకు కీలకమైన సీన్లతో అతడి నటన ఆకట్టుకుంటుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం అతడి పెర్ఫామెన్స్ ఓవర్ ద టాప్ అనిపిస్తుంది. డ్యాన్సులు.. ఫైట్లలో విజయ్ ఎప్పట్లాగే ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కీర్తి సురేష్ గురించి చెప్పడానికేమీ లేదు. ఆమెది కరివేపాకు తరహా పాత్ర. విజయ్ కి సినిమాలో దీటైన విలన్ లేదు. వరలక్ష్మి శరత్ కుమార్ అతడి ముందు నిలవలేకపోయింది. ఆమె చాలా వరకు ఒకే తరహా ఎక్స్ ప్రెషన్ తో కనిపిస్తుంది. రాధారవి ఉన్నంతలో బాగానే చేశాడు. పాల కుప్పయ్య విలనీతో మనవాళ్లు కనెక్టవడం కష్టం. మిగతా నటీనటుల్లో ఎవరికీ చెప్పుకోదగ్గ పాత్ర లేదు.
సాంకేతికవర్గం:
రెహమాన్ పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. సినిమాలో సాంగ్స్ ఏదో అలా నడిచిపోతాయి కానీ.. ప్రత్యేకంగా.. వినసొంపుగా అనిపించే పాటలేమీ లేవు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. కీలకమైన సన్నివేశాల్ని బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది. గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా రిచ్ గా తెరకెక్కింది. ఇక దర్శకుడు మురుగదాస్ ఈ కథను మొదలుపెట్టడానికి ఎంచుకున్న పాయింట్ వరకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది కానీ.. మిగతా కథంతా రొటీనే. ఒకప్పటి మురుగదాస్ సినిమాల్లో కనిపించిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే.. ఎంగేజింగ్ ఎపిసోడ్లు ‘సర్కార్’లో మిస్సయ్యాయి. దర్శకుడిగా మురుగదాస్ ఒకప్పటి మార్కు ఇందులో మిస్సయింది.
చివరగా: సర్కార్.. ‘మన’ సినిమా కాదు
రేటింగ్: 2.25/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre