కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా సర్కార్ కాపీ వివాదంలో చిక్కుకుని సరికొత్త ప్రశ్నలు లేవనెత్తుత్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోర్టు దాకా చేరిన వ్యవహారం వచ్చే గురువారం నాడు తీర్పు రూపంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం. ఇప్పుడు ఈ వివాదానికి మద్దతుగా వ్యతిరేకంగా రెండు రకాలుగా కోలీవుడ్ చీలిపోయింది. కథ తనదే అంటూ క్లెయిమ్ చేస్తున్న వరుణ్ రాజేంద్రన్ కు భాగ్యరాజ్ మద్దతు ఇస్తుండగా మురుగదాస్ పక్షాన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అండగా నిలుస్తోంది. పన్నెండేళ్ల క్రితమే ఈ కథ రాసుకున్నానని రాజేంద్రన్ ఆరోపించి రిజిస్టర్ అయినట్టు ఆధారాలు చూపుతున్నాడు.
మరోవైపు సౌత్ సినీ రైటర్స్ అసోసియేషన్ సైతం రెండు స్టోరీ లైన్లు ఒకేరకంగా ఉన్నాయని ధృవీకరించి ఆ మేరకు సరిఫ్టికేట్ కూడా ఇచ్చిందని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. మురుగదాస్ కూడా ఈ విషయం గురించి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అంటున్నాడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన కోణం ఉంది. భాగ్యరాజ్ కు వరుణ్ రాజేంద్రన్ కు గతంలోనే పరిచయముందని ఇద్దరు కలిసి ఓ సీరియల్ తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కు పదిహేనేళ్ల క్రితమే పనిచేశారని ఆ పరిచయాన్ని ఇప్పుడు వరుణ్ ఇలా వాడుకుంటున్నాడని దాస్ ఆరోపణ. తన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం తప్ప మరో కారణం ఏమి కనిపించడం లేదని ఓపెన్ గానే చెప్పేస్తున్నాడు.
కానీ రెండు లైన్లు ఒకేలా ఉన్నాయట కదా అనే మాటను మాత్రం దాస్ ఒప్పుకోవడం లేదు. పూర్తి స్క్రిప్ట్ చదవకుండా కేవలం ట్రైలర్ చూసి ఇలాంటి అంచనాలకు రావడం ఏంటని రివర్స్ లో ప్రశ్నిస్తున్నాడు. విడుదలకు ఇంకా పది రోజులు కూడా లేని నేపధ్యంలో ఈ వివాదం ఎక్కడి దాకా వచ్చి ఆగుతుందో అని విజయ్ ఫ్యాన్స్ ఇప్పటికే ఆందోళనలో ఉన్నారు. వరుణ్ ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో మాటల దాడి మొదలుపెట్టేసారు. కథ కంచికి చేరినట్టు సర్కార్ కాపీ గొడవ ఏ మజిలీకి చేరుతుందో.