సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. కీర్తి సురేష్ కథానాయిక. పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. లాంఛనంగా సినిమా ప్రారంభమైనా 2021 జనవరి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ సాగనుంది. అమెరికాలో మొదటి షెడ్యూల్ చిత్రీకరించాల్సి ఉంది.
ఈ షెడ్యూల్ కోసం మహేష్ అమెరికా వెళుతున్నారని ఇటీవల ప్రచారమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. షెడ్యూల్ మారింది. మేకర్స్ మనసు మార్చుకున్నారు. అమెరికాలో రెండు నెలల నిడివి గల షెడ్యూల్ ప్లాన్ చేసినా.. సెకండ్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం అక్కడ అంతకంతకు పెరుగుతుండడంతో చిత్రబృందం పునరాలోచనలో పడ్డారట.
ఇక అమెరికా షెడ్యూల్ ని ఏకంగా నాలుగు నెలల పాటు వాయిదా వేశారట. అంటే ఏప్రిల్ లో కానీ అక్కడ చిత్రీకరణకు వెళ్లరు. మహేష్ జనవరి 2021 నుండి భారతదేశంలో పూర్తి చేయాల్సిన ఇతర షెడ్యూల్స్ షూటింగ్ లో పాల్గొంటారు.
సర్కార్ వారి పాట బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ ఎంటర్ టైనర్ అన్న ప్రచారం సాగుతోంది. ఇందులో మహేష్ పాత్రలో డ్యూయల్ షేడ్ షాకిస్తుందన్న గుసగుసలు వినిపించాయి. ఇంతకుముందు మాస్ లుక్ రివీలైంది. అవసరం మేర గెటప్ ఛేంజ్ తో సర్ ప్రైజ్ ఇస్తారట. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు విలన్ గా కనిపించనున్నారట. మహేష్ ఫేవరెట్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్- జిఎంబి ఎంటర్ టైన్మెంట్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.