`స‌ర్కార్ వారి పాట` ఓటీటీ డీల్ ఏ ప్రాతిప‌దిక‌న‌?

Update: 2021-08-02 05:39 GMT
క‌రోనా క్రైసిస్ ర‌క‌ర‌కాల క‌న్ఫ్యూజ‌న్ ల‌కు తెర తీస్తోంది. ముఖ్యంగా సినీప‌రిశ్ర‌మ‌కు ఇది అతి పెద్ద వినాశ‌నం తెచ్చింది. థియేట‌ర్ల రంగం పూర్తిగా దెబ్బ తినేందుకు కార‌ణ‌మైంది. ఇక‌పోతే అదే స‌మ‌యంలో ఓటీటీ బిజినెస్ కి ఇది పెద్ద‌గా ప్ర‌యోజ‌నం చేకూర్చింది. డిజిట‌ల్ వీక్ష‌ణ‌పైకి యువ‌త‌రం స‌హా ఫ్యామిలీ ఆడియెన్ మ‌న‌సు మ‌ళ్లించ‌డానికి ఈ రెండేళ్ల కాలం స‌రిపోయిందని అంచ‌నా. ఇక‌పైనా థ‌ర్డ్ వేవ్ అంటూ భ‌య‌పెట్టేయ‌డం ఓటీటీల‌కు క‌లిసొస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల వ్య‌వస్థ‌ను పున‌రుద్ధ‌రించే ఆలోచ‌న చేసినా కానీ దానిపై ప్రేక్ష‌కులు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తారా లేదా? అన్న‌ది క్లారిటీ రాలేదు.

కార‌ణం ఏదైనా కానీ టాలీవుడ్ బాలీవుడ్ లో ప‌లు క్రేజీ చిత్రాలు ఓటీటీ రిలీజ్ ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ ఏడాదిలో అతి పెద్ద డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ రాధే. స‌ల్మాన్ భాయ్ అంత‌టివాడే ఓటీటీల‌తో పాటు థియేట‌ర్ల‌లో ఏకకాలంలో త‌న రాధేని రిలీజ్ చేశారు.

ఆ త‌ర్వాత రాధేశ్యామ్ ని అదే ఫార్మాట్ లో రిలీజ్ చేస్తార‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఈ సినిమాని 2022 సంక్రాంతికి వాయిదా వేసిన సంగ‌తి తెలిసిన‌దే. అయితే ఈ ఏడాదిలో అతి పెద్ద ఓటీటీ రిలీజ్ అంటూ తాజాగా
స‌ర్కార్ వారి పాట‌
పై గుసగుస‌లు హీటెక్కిస్తున్నాయి. 2022 సంక్రాంతికి మహేష్ బాబు `సర్కారు వారి పాట` విడుదల కావాల్సి ఉంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ వచ్చే ఏడాది జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హ‌క్కుల్ని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువ‌డ‌నుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. అలాగే స‌ర్కార్ వారి పాట శాటిలైట్ హక్కులను స్టార్ MAA సొంతం చేసుకుంది.

తెలుగుపై గురి పెట్ట‌డానికి కార‌ణం?

ఇక‌పోతే ఇటీవ‌లి కాలంలో కేవ‌లం భారీ హిందీ చిత్రాల‌ను మాత్ర‌మే డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ చేజిక్కించుకునేందుకు ఆస‌క్తిగా ఉన్నా.. ఇప్పుడు తెలుగు చిత్రాల‌పైనా దృష్టి సారించ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. బ‌హుశా అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ నుంచి పోటీని ఎదుర్కొనేందుకు ఆహా వంటి ప్రాంతీయ ఓటీటీల దూకుడుతో పోటీప‌డేందుకు డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ వాళ్లు ఇలా ప్లాన్ చేశార‌ని భావించ‌వ‌చ్చు. ఈ ఓటీటీ సంస్థ‌కు తెలుగులో వ్యూవ‌ర్ షిప్ పెంచుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఇంత పెద్ద డీల్ కి కార‌ణ‌మై ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

మ‌రోవైపు థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావాన్ని బ‌ట్టి కూడా నిర్ణ‌యం ఎలా ఉంటుందో చెప్ప‌లేం. వ‌చ్చే ఏడాది సంక్రాంతి స‌మ‌యానికి మ‌హ‌మ్మారీ ప‌రిస్థితి ఎలా ఉండ‌నుంది? ఒక‌వేళ స‌ర్కార్ వారి పాట‌ను `రాధే` ఫార్మాట్ లో ఒకేసారి ఓటీటీ ప్ల‌స్ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తారా? అస‌లు డీల్ ఎలా కుదిరింది? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News