సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మహేష్ బాబు కెరీర్ లో 27వ సినిమాగా వస్తోన్న 'సర్కారు వారి పాట' పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఏ కంటెంట్ రిలీజ్ చేసినా సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
లేటెస్టుగా సినిమాలోని సెకండ్ సింగిల్ 'పెన్నీ' సాంగ్ మ్యూజిక్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్ ముద్దుల తనయ సితారా ఘట్టమనేని తన తండ్రి తో కలిసి కనిపించింది. ఇంస్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ల కొలదీ వ్యూస్ దక్కించుకుంటోంది. ఈ క్రమంలో టాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
'పెన్నీ' పాటకు 24 గంటల్లో 18 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో తెలుగులో అత్యధికంగా వీక్షించబడిన సాంగ్ గా ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. సూపర్ డాడ్-డాటర్ ద్వయం మహేష్ అండ్ సితార కలిసి ఈ ఫీట్ సెట్ చేసారని చెప్పవచ్చు.
ఇకపోతే ఇటీవల 'సర్కారు వారి పాట' నుంచి విడుదల చేయబడిన 'కళావతి' పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ గీతం ఇప్పటి వరకు 99 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి 1 బిలియన్ దిశగా దూసుకుపోతోంది.
'కళావతి' పాటకి 24 గంటల్లో 14.78 మిలియన్ల వ్యూస్ రాగా.. ఇప్పుడు 'పెన్నీ' సాంగ్ కు అదే 24 గంటల్లో 18 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం. ఇక ఈ పాటకు యూట్యూబ్ లో దాదాపు 6 లక్షల లైక్స్ రావడం గమనార్హం.
'పెన్నీ' సాంగ్ మ్యూజిక్ వీడియో మేకింగ్ మరియు విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సితార పాప క్యూట్ పెర్ఫామెన్స్ - స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ కు మహేష్ బాబు సూపర్ స్టైలిష్ లుక్స్ జత చేకూరాయి. శేఖర్ మాస్టర్ దీనికి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఎస్ ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ పెప్పీ డ్యాన్స్ నంబర్ ను యువ సింగర్ నాకాష్ ఆజీజ్ ఆలపించారు. ఈ మ్యూజిక్ వీడియోలో సితార తో పాటుగా వీరిద్దరు కూడా ఆడిపాడారు.
పెన్నీ పాటకు గీత రచయిత అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ చాలా ట్రెండీగా క్యాచీగా ఉన్నాయి. 'డేట్ ఇచ్చాక దాటిందంటే.. దమ్కి తప్పదు రే.. నీ బాబు బిల్గేట్స్ ఐనా.. నీ బాబాయి బైడెన్ ఐనా.. నా బాకీ రాలేదంటే బ్లాస్ట్ యే స్టేట్ ఐనా.. కాకా నువ్ లోకల్వైనా.. నా మార్కెట్ గ్లోబల్ నైనా.. గ్లోబ్ అంతా దేకించేస్తా.. లవ్ ఎవ్రీ పెన్నీ.. నీదే అవనీ నాదే అవనీ.. రెస్పెక్ట్ ఎవ్రీ పెన్నీ..' అంటూ సాగుతూ తెగ ఆకట్టుకుంటున్నాయి.
'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 12న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.